మోహన్ బాబు 40 వసంతాల వేడుక విశాఖపట్నం లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. చిరంజీవి, దాసరి, వెంకటేష్, రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్… ఇలా అతిరథమహారధులు పాల్గున్నారు. మోహన్ బాబుని అభినందించి వచ్చారు. అయితే మోహన్ బాబు ఆప్త మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం రాలేదు. ఈ కార్యక్రమానికి రజని వస్తాడని ప్రచారం జరిగింది. విశాఖ వాసులు కూడా అదే అనుకున్నారు. తీరా రజని రాకపోయేసరికి కాస్త నిరాశ పడ్డారు. ఐతే రజని కాంత్ కూడా రావాలనే అనుకున్నాడట. వ్యకిగత కారణాలవల్ల రాలేదట. రజని ఆరోగ్యం బాగాలేదని అందుకే హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. రజని కుమార్తె సౌందర్య ఇటీవలే విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. రజనీ రాకపోవడానికి అది కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. నేను రాలేకపోతున్నా.. అని రజని ముందే చెప్పేశాడట. మరో వైపు నందమూరి, అక్కినేని ఫ్యామిలీ ల నుంచి కూడా ఎవరూ కనిపించలేదు. బాలయ్యని ఆహ్వానించినా…. గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయాడట. ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే వున్నాడు. తానెందుకు రాలేదో..?