జ్యో అచ్చుతానంద చూశారా? అందులో నాగశౌర్య, రెజీనాల కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది కదూ? వాళ్లిద్దరూ ఆ సినిమాలో కలుసుకోలేదు గానీ.. జంటగా మరిన్ని సినిమాలు చేస్తే బాగుండేది అనిపించేంతలా కలిసిపోయారు. ఆ జంట చూడముచ్చటగా ఉంది అని కితాబులు అందుకొన్నారు. కానీ అదంతా సెట్లో, సినిమాలో వరకే అట. ఏమైందో గానీ.. రెజీనా, నాగశౌర్యలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని విశ్వసనీయ వర్గాల టాక్.జ్యో అచ్చుతానంద మొదలైనప్పుడు వీరిద్దరూ బాగానే ఉన్నారని, అయితే ఆ తరవాతే… గ్యాప్ వచ్చేసిందని, ఈ సినిమా ముగిసే సరికి ఆ దూరం మరింత పెరిగిపోయిందని చెప్పుకొంటున్నారు. కలసి ప్రమోషన్లకు రాకపోవడం ఈ వాదనని మరింత బలపరుస్తోంది.
ఈమద్య హైదరాబాద్‌లో ని ప్రసాద్ లాబ్స్‌లో జ్యో అచ్యుతానందకు సంబంధించిన ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో రెజీనా, అవసరాల శ్రీనివాస్, సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి పాల్గొన్నారు. నాగశౌర్య కూడా అక్కడి వరకూ వచ్చాడట. కానీ ప్రెస్ మీట్లో రెజీనా ఉందని తెలిసి అప్పటికప్పుడు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని గుసగుసలు వినిపించాయి. ”ఏమైందో తెలీదు. ఇద్దరి మధ్యా మాటల్లేవు. ఇద్దరినీ కలసి ప్రమోషన్లకు తీసుకురావాలంటే తల ప్రాణం తోకకు వస్తోంది. వీరిద్దరి మధ్య గ్యాప్ పోగొట్టాలని దర్శక నిర్మాతలు కఠోరంగా శ్రమించారు. కానీ ఫలితం దక్కలేదు” అంటూ ఇరువురి సన్నిహితులూ చెప్పుకొస్తున్నారు. మరి ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమేంటో, ఎడమెహం పెడమొహంగా ఎందుకు ఉంటున్నారో.. వాళ్లకే తెలియాలి. నాగశౌర్య, రెజీనాలను మరోసారి జంటగా చూడాలనుకొన్న వారి కలలు కల్లలయ్యేలానే ఉంది.