విజువల్ ఫీస్ట్ : ప్రేమమ్ ట్రైలర్

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్టు కొట్టిన ప్రేమ‌మ్ తెలుగులో రీమేక్ చేస్తున్నార‌న‌గానే చాలా సందేహాలొచ్చాయి. ఆ సినిమాలోని ఫీల్‌ని రీమేక్‌లో క్యారీ చేస్తారా అని అనుమానించారంతా. ఇప్పుడు ప్రేమ‌మ్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ చూస్తుంటే ప్రేమ‌మ్‌లో ఫీల్‌ని 100 శాతం దింప‌క‌పోయినా త‌మ వంతు ప్రయ‌త్నం మాత్రం చేశార‌ని స్పష్టంగా అర్థమ‌వుతోంది. 90 సెక‌న్ల పాటు సాగిన ట్రైల‌ర్‌లో దాదాపు నిమిషం పాటు చైతూ డైలాగే వినిపిస్తోంది. ”ఈ ప్రపంచంలో ప్రతీ ప్రేమ‌క‌థా మ‌ధురంగానే ఉంటుంది. మ‌న‌ది మ‌న‌కు మ‌రీ అద్భుతంగా అనిపిస్తుంది” అంటూ ఓ సుదీర్ఘమైన డైలాగ్ వినిపించాడు చైతూ. చివ‌ర్లో ‘మ‌రో పెగ్గేద్దాం’ అంటూ దేవ‌దాసు అవ‌తారం కూడా ఎత్తాడు. చైతూ విష‌యానికొస్తే…. మూడు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించాడు. ట్రైల‌ర్ విజువల్ ఫీస్ట్‌లా అనిపించింది. మెలోడ్రామాకు చోటివ్వకుండా.. సినిమా అంతా హాయిగా సాయిపోయేలా చందూ మొండేటి తీర్చిదిద్దాడ‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సినిమా కోసం ఖ‌ర్చు పెట్టిన ప్రతీ పైసా తెర‌పై క‌నిపిస్తోంది. పాట‌లు ఆల్రెడీ హిట్టయ్యాయి. సినిమా విడుద‌ల‌య్యాక జ‌నంలోకి మ‌రింత దూసుకెళ్లిపోయే అవ‌కాశం ఉంది. మొత్తానికి ప్రేమ‌మ్ ట్రైల‌ర్ బోలెడ‌న్ని ఆశ‌ల్నీ, అంచ‌నాల్నీ పెంచేసింది. చైతూ ఆశ‌ల‌న్నీ… తీరే క్షణాలు ద‌గ్గర ప‌డుతున్నట్టే అనిపిస్తోంది. శ్రుతిహాస‌న్‌, మ‌డోనా, అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం అక్టోబ‌రు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close