రాశిఖన్నా ఫాన్స్ తీవ్రవాదులా?

రామ్ సినిమాల్లోనే కాదు బయట కూడా భలే ఎనర్జిటిక్ గా ఉంటాడు. రామ్ మాట్లాడితే మన పక్కింటి కుర్రాడిలా… మనింటి కుర్రాడిలా అనిపిస్తుంది. కాసేపటి క్రితం ముగిసిన హైపర్ ట్రైలర్ ఫంక్షన్ లో కూడా రామ్ తన మాట తీరుతో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ లో పంచ్ లేమోగానీ తన స్పీచ్ లో చాలా మందిపై పంచ్ లు పడ్డాయి. ఒక్కరినీ వదలకుండా… అందరిపైనా సెటైర్లు వేసాడు.

సంగీత దర్శకుడు జీబ్రాన్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీ కోసం వొచ్చినా మాకు మంచి ట్యూన్స్ ఇచ్చాడు… అని జోక్ చేశాడు.

హైపర్ అనే టైటిల్ నన్ను చూసి పెట్టింది కాదు. నాకంటే మా డైరెక్టర్ ఇంకా హైపర్. 3 నెలల్లో సినిమా తీసేసాడు అంటూ సంతోష్ శ్రీనివాస్ కి కంప్లిమెంట్ ఇచ్చాడు.

రాశీ ఖన్నా కి స్లీపర్ సెల్స్ రూపంలో ఫాన్స్ ఉన్నారట. వాళ్లంతా రాశికి హిట్ పడితే తీవ్రవాదులుగా మారిపోతారట. ఇది కామెంట్ అనుకోవాలో కాంప్లిమెంట్ అనుకోవాలో రాశీ కీ అర్ధం అయ్యుండదేమో.

మొత్తానికి హైపర్ ఫంక్షన్ లో రామ్ ఇంకా హైపర్ గా కనిపించాడు. హిట్ కొట్టేస్తాం అనే నమ్మకం ఈ ట్రయిలర్ తో బాగా పెరిగిపోయిందేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రైతు రుణమాఫీ … రేవంత్ సర్కార్ కు చిక్కులు..!!

రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ కు కొత్త చిక్కులు ఎదురు అవుతున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీ కోసం అవసరమైన 30వేల కోట్లను ఒకేసారి రాబట్టుకోవడం ప్రభుత్వానికి అంత సులభతరం కాదని అధికార...

ప్రజా పాలనను ప్రతిబింబించేలా రేవంత్ మార్క్ డెసిషన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు అసెంబ్లీ వేదికగానే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. గత ప్రభుత్వం మాదిరి ఏకపక్ష నిర్ణయాలు...

రేపు అనేదే లేదా ? ఆఫీసర్లకు పేర్ని నాని హెచ్చరిక

వైసీపీ నేతల ఆర్తనాదాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఎంతగా అంటే.. చివరికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. ఏ ఒక్కరినీ వదలం.. రేపు అనేది లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఎవరిపైన అంటే.....

ఏబీవీకి పోస్టింగ్ – తెర వెనుక చాలా జరిగింది !

ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెల్ల వారే సరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వడం , రిటైర్మెంట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close