కమర్షియల్ సినిమాకి ఎప్పుడూ పోటీ లేదు. కావాల్సిన మసాలా దినుసులన్నీ సరిగ్గా నూరి వండితే… గుండెలమీద చేయి వేసుకుని సినిమా విడుదల చేయొచ్చు. కాస్త యాక్షన్, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, బోలెడంత హీరోయిజం, పిసరంత రొమాన్స్ ఇవన్నీ కలగలిపితే కనీసం మినిమమ్ గ్యారెంటీ అయినా వచ్చి పడిపోతుంది. హైపర్ ట్రైలర్ చూస్తుంటే ఇది అలాంటి సినిమానే అనే నమ్మకం కలుగుతొంది. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. హైపర్ ట్రయిలర్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యింది.
నాన్నంటే ప్రేమ కాదు… పిచ్చి వున్న ఓ కొడుకు కథ ఇది. ఈ సంగతి ఇదివరకు విడుదల చేసిన టీజర్ లోనే చెప్పేసారు. ఆ పిచ్చిని ఇంకాస్త ఎక్సటెంక్షన్ చేసి చూపించారు ట్రయిలర్ లో. రామ్ తాలూకూ ఎనర్జీ ప్రతీ ఫ్రేమ్ లోనూ క్యారీ అయ్యింది. అచ్చమైన కమర్షియల్ సినిమాకి నిర్వచనం లా కనిపించింది ట్రైలర్. ట్రైల్ రూమ్ లో వున్నాం.. ఓ సారి ట్రయిల్ వేస్తావా అంటూ…. రాశీ ఖన్నా చేత ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా పలికించారు. విజువల్ గా రిచ్ గా వుంది సినిమా. రభస తో నిరాశ పరచిన సంతోష్ ఈ సారి లెక్క తప్పకూడదన్న ఉద్దేశ్యం తో ప్రయోగాలకు పోకుండా ఈ సినిమా ని అన్ని మసాలాలతో మేళవించాడు. రామ్ కి మరో హిట్ ఖాయంలానే వుంది.