ఇదో రకం యుద్దమా? భలే ఉంది

యూరీ ఉగ్రవాదుల దాడుల తరువాత భారత ప్రభుత్వం నోట ఒక్కసారి కూడా ‘యుద్ధం’ అనే మాట అనలేదు కానీ తన మాటలతో చేతలతో ఇంచుమించు అటువంటి యుద్ద వాతావరణమే సృష్టించి పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకరోజు, పాకిస్తాన్ కి ఇచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాని రద్దు చేసి దానితో వ్యాపార సంబంధాలని తెంచుకొబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తాయి. మరో రోజున, పాక్ తో సింధూ జలాల పంపకాలపై చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తాయి. మరొక రోజున పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు తెంచుకోబోతున్నట్లు వార్తలు వస్తాయి. పాకిస్తాన్ చేత బహిష్కరించబడిన బలూచ్ వేర్పాటువాద నేత బుగ్తీకి రాజకీయ ఆశ్రయం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తాయి. ఇప్పుడు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఆయన తన నివాసంలో ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌, వాయుసేన చీఫ్ అరూప్‌ రహా, నేవీ వైస్‌ చీఫ్‌ తో సమావేశం అయ్యారు.

మీడియాకి ఆ మాత్రం క్లూ అందిస్తే చాలు మిగిలిన స్టోరీ అంతా అవే అల్లేసుకోగలవు. వారు ఏమి మాట్లడుకోన్నారో మీడియాకి తెలియకపోయినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి భారత సేనలని పంపించి అక్కడ దాగున్న ఉగ్రమూకలని ఏరివేయడానికే ఆయన వారితో సమావేశం అయ్యారనో లేకపోతే పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్దం చేయడం గురించి చర్చిస్తున్నారనో వ్రాసుకొనే సౌలభ్యం వాటికి ఉంది. భారత్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి పాకిస్తాన్ ప్రభుత్వం ‘యుద్ధం యుద్ధం’ అంటూ తెగ పలవరిస్తోంది. అంతే కాదు..నిజంగానే యుద్ద సన్నాహాలు చేయడం మొదలుపెట్టేసింది. దాని యుద్ద విమానాలు పాక్ గగనతలంపై రివ్వు రివ్వున ఎగురుతుంటే, అది చూసి పాక్ ప్రజలు సంతోషపడకపోగా చాలా ఆందోళన చెందుతున్నారు.

ఇదే అదునుగా పాక్ మీడియా కూడా తన టి.ఆర్.పి. రేటింగ్ పెంచుకోవడం కోసం అయితేనేమి లేదా మిగిలిన చానళ్ళ కంటే తాము వెనుకబడిపోకూడదనే తాపత్రయంతోనైతేనేమి పాక్ ప్రభుత్వం చేస్తున్న యుద్ద సన్నాహాల గురించి కధకధలుగా వర్ణించి చెపుతూ ప్రజల ఆందోళనని ఇంకా పెంచి పోషిస్తోంది. పాక్ చేస్తున్న ఈ హడావుడితో తన యుద్ధోన్మాదం గురించి లోకానికి మరొకసారి స్వయంగా చాటుకొన్నట్లు అయ్యింది. పాక్ ప్రభుత్వం, సేనలు చేస్తున్న హడావుడి చూసి, ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ కి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ హడావుడికి పాక్ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిడుకులకి గురవుతున్నాయి. మదుపరులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాక్ ప్రభుత్వం నిర్ణయం కారణంగా కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.

గమ్మతైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ లో ఇంత హడావుడి జరుగుతున్నా భారత్ లో అన్నీ యధాప్రకారమే జరిగిపోతున్నాయి. ఎక్కడ ఆవగింజంత మార్పు లేదు. మీడియాలో వస్తున్న వార్తలు, ఊహాగానాలే తప్ప కేంద్రప్రభుత్వం తరపున ఒక్కసారి కూడా ఎవరూ పాకిస్తాన్ తో తమ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించబోతోందనే విషయం అధికారికంగా చెప్పనేలేదు. కేవలం చిన్న చిన్న మీడియా లీకులతోనే మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తన వేళ్ళతో తన కళ్ళు పొడుచుకొనేలా చేస్తోంది. రక్తం చుక్క చిందకుండా, కూర్చొన్న కుర్చీలో నుంచి లేవకుండా ఇలాగ కూడా యుద్ధం చేయవచ్చని మోడీ చూపిస్తున్నారు. గ్రేట్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close