బాహుబలి 2 కోసం ధోనీ వెయిటింగ్ ఇక్కడ….

బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, యావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ న‌టులు, ద‌ర్శకులు కూడా బాహుబ‌లి 2 ఎప్పుడా.. అని క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు. ఆ జాబితాలో క్రికెట‌ర్ మ‌హేంద్రసింగ్ ధోనీ కూడా చేరాడు. ధోనీ జీవిత క‌థ ఆధారంగా ఓ చిత్రం తెర‌కెక్కింది. దీన్ని తెలుగులో కూడా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ధోని హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఇక్కడ జేఆర్‌సీ ఫంక్షన్ హాల్‌లో ధోనీ – ద అన్ టోల్డ్ స్టోరీ సీడీని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ధోనీ మాట్లాడుతూ ”బాహుబ‌లి సినిమా చూశా. రాజ‌మౌళి సినిమాల‌న్నీ బాగుంటాయి. బాహుబ‌లి 2 కోసం అందిరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నా. నాకు హైద‌రాబాద్ బిరియానీ అంటే ఇష్టం. 2000 వ సంవ‌త్సరంలో హైద‌రాబాద్ వ‌చ్చా. అప్పటి నుంచీ ఈ న‌గరం బాగా న‌చ్చింది. చార్మినార్ గాజుల‌న్నా ఇష్టమే” అన్నాడు. ధోనీ త‌న అభిమాన క్రికెట‌ర్ అని, ధోనీ వ్యక్తిత్వం గొప్పగా ఉంటుంద‌ని రాజ‌మౌళి తెలిపారు.

ఈసారి వ‌చ్చిన‌ప్పుడు రాజ‌మౌళి ఇంటికి వ‌స్తాన‌ని ధోనీ ఈ సంద‌ర్బంగా మాట ఇచ్చాడ‌ని తెలుస్తోంది. అయితే చెన్నైలోనూ ధోనీ ఇలాంటి పాటే పాడాడు. చెన్నైలో ఉన్నప్పుడు ర‌జ‌నీకాంత్‌, సూర్యల ఫ్యాన్ అని చెప్పిన ధోని, హైద‌రాబాద్‌లోకి అడుగుపెట్టాక రాజ‌మౌళి, బాహుబ‌లి, హైద‌రాబాద్ బిరియానీల గురించి మాట్లాడాడు. ప‌రిస్థితుల‌కు, ప్రాంతాల‌కూ త‌గ్గట్టుగా మాట్లాడ‌డం సినిమా స్టార్లకూ, రాజ‌కీయ నాయ‌కుల‌కే తెలుస‌నుకొంటే.. ఆ జాబితాలో క్రికెటర్లూ చేరిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close