మెగా హీరోల కోసం.. మెహర్ రమేష్ రెడీ

తెలుగు చిత్రసీమ తట్టుకోలేని డిజాస్టర్లు ఇచ్చిన ఘ‌న‌త మెహ‌ర్ ర‌మేష్‌. కంత్రి, శ‌క్తి, షాడో.. ఇలా మెహ‌ర్ క‌ళాఖండాలు తీశాడు. శ‌క్తి, షాడో అయితే.. మాట‌ల్లేవ్ ఇక‌! షాడో త‌ర‌వాత మెహ‌ర్ పేరు త‌ల‌చుకోవ‌డానికే భ‌యం వేసింది. మెహ‌ర్ కూడా సీరియ‌స్‌గా ప్రయ‌త్నాలు చేయ‌లేదు. ఆ మాట‌కొస్తే ఎవ్వరికీ క‌నిపించ‌లేదు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ స్ర్కిప్టు ప‌ట్టుకొని తిరుగుతున్నాడ‌ని టాక్‌. ఓ క‌థ రాసి, స్టార్ హీరో డేట్ల కోసం వెంట ప‌డుతున్నాడ‌ట‌. మెహ‌ర్‌తో ఇది వ‌ర‌కు ప‌రిచ‌యం ఉన్న హీరోలు కొంత‌మంది ఓపిగ్గా క‌థ వింటున్నా.. మిగిలిన వాళ్లు మెహ‌ర్‌కు అందుబాటులో లేకుండా పోయార‌ని తెలుస్తోంది. అయితే మెహ‌ర్ ఇప్పుడు అశ్వనీద‌త్ ద‌గ్గర‌కు చేరిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో తీసిన‌ శ‌క్తి సినిమాకి నిర్మాత ద‌త్‌నే. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హిట్ సినిమా తీసి పెడ‌తా.. అంటున్నాడ‌ట‌.

క‌థ విన్న ద‌త్ కూడా ఈ ప్రాజెక్టుపై న‌మ్మకం పెంచుకొన్నాడ‌ని ‘స‌రిగ్గా తీస్తే హిట్టు గ్యారెంటీ’ అని ఆయ‌న కూడా ఈ సినిమాపై మోజు ప‌డుతున్నాడ‌ని టాక్‌. ద‌ర్శకుడు, క‌థ‌, నిర్మాత రెడీ అయిపోతే హీరో దొరికేయ‌డం సుల‌భ‌మే. అయితే ఈ క‌థ ఓ స్టార్ హీరోని డిమాండ్ చేస్తోంద‌ట‌. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితి చూస్తే స్టార్ హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. దానికి తోడు మెహ‌ర్ ట్రాక్ రికార్డు చూస్తే… ఆ సాహ‌సం చేయ‌డానికి ముందుకు రాక‌పోవొచ్చు. అందుకే మినిమం రేంజున్న హీరోతో స‌ర్దుకుపోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్ తేజ్‌, గోపీచంద్ వీళ్లలో ఒక‌రితో మెహ‌ర్ సినిమా మొద‌ల‌య్యే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. అయితే వీళ్లు కూడా ఒప్పుకొంటేనే. చూశారా.. ఈ డిజాస్టర్లు ఎంత ప‌ని చేశాయో?? చేతిలో మంచి క‌థ ఉన్నా హీరో దొర‌క‌డం లేదు. బ్యాడ్ ల‌క్ అంటే ఇంతే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close