ఈడు గోల్డ్ ఎహె ట్రైలర్ : చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఒకే కార్లో

బాక్సాఫీసు ద‌గ్గర ఓ క్లీన్ హిట్ కోసం సునీల్ వీర ప్రయ‌త్నాలు చేస్తున్నాడు. ఇటీవ‌ల వ‌చ్చిన జ‌క్కన్న కూడా సునీల్‌ని నిరాశ ప‌రిచింది. సునీల్ గ‌ట్టెక్కాలంటే ఈడు గోల్డ్ ఎహె హిట్టు కొట్టాల్సిందే. వీరూ పోట్ల ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెర‌కెక్కించింది. గ‌త వారం రోజులుగా ఈ సినిమా ప్రచారం ఓ లెవిల్లో సాగుతోంది. ఊరూరా తిరిగి… పాట‌ల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైల‌ర్ కూడా వ‌చ్చింది. సునీల్ గ‌త సినిమాల లానే.. ‘మా సినిమాలో అన్ని ర‌సాలూ ఉన్నాయి’ అని చెప్పాల‌న్న ఉద్దేశంతో ట్రైల‌ర్ క‌ట్ చేశారు. పంచ్ ల కోసం ట్రై చేయ‌క‌పోవ‌డం కాస్త రిలీఫ్ క‌లిగించేదే. చివ‌ర్లో చంద్రబాబు, కేసీఆర్‌, జ‌గ‌న్ ఒకే కార్లో….. అని సునీల్ ఓ జోకు చెప్పడానికి ట్రై చేస్తాడు. ఈ ట్రైల‌ర్‌కి అదే హైలెట్టు.

ట్రైల‌ర్ చూస్తుంటే టామ్ అండ్ జ‌ర్రీ ఆట‌తో పాటు.. ఏదో ఓ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఉన్నట్టే క‌నిపిస్తోంది. కిక్ సినిమాలో ర‌వితేజ మాస్క్ వేసుకొన్నట్టు ఇందులోనూ సునీల్ ఓ మాస్క్‌తో క‌నిపిస్తున్నాడు. దాని చుట్టూ ఓ ఆసక్తిక‌ర‌మైన క‌థ న‌డిచే అవ‌కాశం వుంది. . ట్రైల‌ర్ చూస్తుంటే కామెడీ గ్యాంగ్ అంతా ఓ చోట చేరిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులూ బీభ‌త్సంగానే ఉన్నాయి. మ‌రి అవ‌న్నీ ఈ సినిమానీ, సునీల్ కెరీర్‌నీ ఎంత వ‌ర‌కూ కాపాడ‌తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close