నా గురువు ప్రభుదేవా : తమన్నా

త‌మ‌న్నా డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రభుదేవా ఇండియ‌న్ మైఖైల్ జాక్సన్ అయితే.. త‌మ‌న్నా లేడీ ప్రభుదేవా. స్టార్ హీరోలంద‌రితోనూ పోటీ ప‌డి చిందులేసింది మిల్కీ బ్యూటీ. ఇప్పుడు అభినేత్రి సినిమాలోనూ త‌మ‌న్నా అదిరిపోయే స్టెప్పులేసింది. డాన్సుల్లో త‌న సూప‌ర్ మాజిక్‌కి సీక్రెట్ ఏంటో చెప్పేసింది త‌మ్మూ. డాన్సుల్లో త‌న గురువు ప్రభుదేవానే అంటోంది. అభినేత్రి ఆడియో ఫంక్షన్ ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా మాట్లాడుతూ త‌న డాన్సింగ్ సీక్రెట్ ని చెప్పింది.

త‌మ‌న్నా మాట్లాడుతూ ”డాన్స్ చేసిన‌ప్పుడల్లా నేను ప్రభుదేవా సార్‌ని గుర్తుపెట్టుకొంటాను. చిన్నప్పటి నుంచీ నేను ఏదో ఓ ప‌నిచేస్తూనే ఉన్నా. నేర్చుకోవ‌డానికి స‌మ‌యమే దొర‌క‌లేదు. తొలిసారి ఈ సినిమా ద్వారా డాన్స్ నేర్చుకొన్నా. అదీ ప్రభుదేవా సార్ నుంచే. ఈ విష‌యంలో నాకు ఆయ‌నే గురువు. ఇక నుంచి మ‌రింత క‌ష్టప‌డి డాన్సులు చేస్తా” అంది. ‘అభినేత్రి’లో తాను డ్యూయెల్ రోల్ చేసిన‌ట్టు చెప్పేసింది త‌మ‌న్నా. కేవ‌లం 15 నిమిషాల్లో ఈ క‌థ విని ఒప్పుకొంద‌ట‌. అంత బాగా న‌చ్చేసింద‌ట‌. ఈ సినిమా తీసిన కోన వెంక‌ట్‌ని బోలెడ‌న్ని డ‌బ్బులు రావాల‌ని, ఆ డ‌బ్బులు లెక్కపెట్టలేక బ్యాంకులు కూడా బాబోయ్ అనాల‌ని చ‌మ‌త్కరించింది త‌మ్మూ. అభినేత్రిలో త‌మ‌న్నా డాన్సులు, ట్రైల‌ర్ చూస్తుంటే నిజంగానే ఈ సినిమా హిట్టు కొట్టేసిన‌ట్టే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close