నేనెప్పుడూ డబ్బుల కోసమే చేస్తా : తమన్నా

టాలీవుడ్‌లో ఐటెమ్ సాంగ్ చేసే స్టార్ క‌థానాయిక అన‌గానే త‌మన్నా గుర్తొస్తుంది. త‌మ‌న్నా మంచి డాన్సర్ క‌మ్‌ గ్లామ‌ర్ క్వీన్ క‌మ్ స్టార్ కాబ‌ట్టి.. ఆమెకు ఐటెమ్ గీతాల అవ‌కాశాలు హోరెత్తుతున్నాయి. ఒకొక్క పాట‌కూ రూ.50 నుంచి 70 ల‌క్షల వ‌ర‌కూ తీసుకొంటోంద‌ని స‌మాచారం. జాగ్వార్ సినిమా కోసం ఏకంగా రూ.90 ల‌క్షలు పారితోషికంగా అందుకొంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌మ‌న్నా కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఐటెమ్ గీతాల్ని ఒప్పుకొంటోంద‌న్న విమ‌ర్శలొస్తున్నాయి. వీటిపై త‌మ‌న్నా స్పందించింది. ”ఐటెమ్ గీతాలే కాదు.. సినిమాలు కూడా నేను డ‌బ్బుల కోస‌మే చేస్తాను క‌దా? క‌థానాయిగానూ, ఐటెమ్ గాళ్‌గానూ నేను డ‌బ్బులు బాగానే తీసుకొంటా. అలాంట‌ప్పుడు రెండింటినీ వేరుగా ఎందుకు చూస్తారు?” అంటూ తెలివిగా ప్రశ్నిస్తోంది త‌మ‌న్నా.

”నాకు డాన్స్ అంటే ఇష్టం. నేను డాన్స్ చేస్తే చూడాల‌ని చాలా మంది ఎదురుచూస్తున్నారు. వాళ్లంద‌రి కోసం, నా కోసం నేను ఐటెమ్ గీతాల్ని ఒప్పుకొంటున్నా. సౌత్ ఇండియాలో క‌థానాయిక‌లు ఐటెమ్ గీతాలు చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తారు. అదే బాలీవుడ్‌కి వెళ్లండి. అక్కడ ఇలాంటి అవ‌కాశం ఎప్పుడొస్తుందా అని స్టార్ హీరోయిన్లంతా ఎదురుచూస్తుంటారు. అదృష్టం కొద్దీ నాకు ఐటెమ్ గీతాల అవ‌కాశాలు బాగా వ‌స్తున్నాయి. అందుకే చేస్తున్నా” అని క్లారిటీ ఇచ్చింది. డ‌బ్బుల కోస‌మే ఐటెమ్ గీతాలు చేస్తా అని నిర్మొహ‌మాటంగా చెప్పేయ‌డానికి కూడా గట్స్ ఉండాల్లెండి. మొత్తమ్మీద మ‌రిన్ని ఐటెమ్ గీతాల‌కు త‌మ‌న్నా రెడీ అన్నమాట‌. ఇక నిర్మాత‌ల‌దే ఆల‌స్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close