టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ పని అయిపోయిందన్న వాళ్ళే ఎక్కువ మంది. పొలిటికల్ శతృత్వంతో పాటు ఓవర్సీస్, క్లాస్ ఆడియన్స్ ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోవడంతో మళ్ళీ టాప్ రేంజ్‌కి రావడం ఎన్టీఆర్‌కి కష్టమే అని చాలా మంది విశ్లేషించేసి డెసిషన్ కూడా చెప్పేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం నాన్నకు ప్రేమతో సినిమాతో అలాంటి వాళ్ళందరికీ మెంటలెక్కిపోయే రేంజ్లో సమాధానమిచ్చాడు. ఆ తర్వాత జనతా గ్యారేజ్ సినిమా అయితే టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ సునామీనే సృష్టిస్తోంది.
ఆ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ తర్వాత సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకులు అంటూ వినిపిస్తున్న పేర్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వక్కంతం వంశీ, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, వి.వి.వినాయక్, లింగుస్వామి, త్రివిక్రమ్ శ్రీనివాస్…ఇప్పుడు లేటెస్ట్గా సురేందర్‌రెడ్డి కూడా లైన్లోకి వచ్చాడట. పవన్, మహేష్‌లతో పోల్చి చూస్తే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోవడం ఎన్టీఆర్‌కి పెద్దగా అలవాటు లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈ సారి ఎందుకు గ్యాప్ తీసుకున్నాడో తెలియదు, ఇంకా ఎంతకాలం గ్యాప్ తీసుకుంటాడో తెలియదు కానీ ఈ గ్యాప్‌లో ఇంకా ఎంతమంది డైరెక్టర్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారన్న గాసిప్స్ వినిపిస్తాయో చూడాలి మరి. ఎంతైనా సక్సెస్‌లో ఉన్నప్పుడు ఉండే క్రేజే వేరబ్బా. ఏం చేసినా, ఏమీ చేయకపోయినా ఎప్పుడూ మన గురించే మాట్లాడుకుంటూనే ఉంటారు.