రాజమౌళి తెలుగు మీడియాను తక్కువ అంచనా వేశాడా? ట్రాప్ చేశాడా?

అసలు ఏ విషయమూ లేకపోతేనే.. ఏదో ఒకటి జరుగుతోందని గాసిప్స్ రాసేయడంలో ఇప్పుడు భారతదేశ మీడియా మొత్తం కూడా చాలా అడ్వాన్స్ అయి ఉంది. ఇక ఫలానా తేదీన ఓ గొప్ప విషయం ఉంది అని చెప్తే ఇంకేముంది? ఆ సీక్రెట్‌ని బయటపెట్టకుండా మీడియా ఉంటుందా? అదే జరిగింది. గత కొంత కాలంగా ఎప్పుడూ లేని విధంగా తెలుగు మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ హింట్స్ ఇచ్చేశాడు రాజమౌళి. అదే కొంపముంచింది. ఐదో తేదీన అధికారికంగా ప్రకటించాలన్న రాజమౌళి ఆలోచన ఆవిరైపోయింది. దాంతో ఇక తప్పని సరి పరిస్థితుల్లో ఈ రోజే అధికారికంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. మన మీడియా వాళ్ళను ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్స్ సరిగ్గా వాడుకోవడం లేదు కానీ కరెక్ట్‌గా ఉపయోగించకుంటే పాకిస్తాన్ తీవ్రవాదుల నుంచి లోకల్‌గా ఉన్న క్రిమినల్స్ వరకూ అందరి వివరాలు చిటికెలో చెప్పేసే తెలివితేటలు వాళ్ళ సొంతం అని చాలా మంది అభిప్రాయం. పోకిరి సినిమాలో నాజర్ చెప్పినట్టుగా వీరప్పన్‌ని వెతకడం, పట్టుకోవడం పోలీసులకు కష్టమైంది కానీ మీడియా వాళ్ళకు మాత్రం అన్ని విషయాలూ తెలిసిపోతూనే ఉన్నాయి.

అయితే ఇక్కడే ఇంకో అసలు ట్విస్ట్ కూడా ఉంది. పోలీసులు, నాయకులకు కూడా వీరప్పన్ ఆనుపానులు తెలుసునని, కానీ చాలా మందికి ఆయన బినామీ కావడమో, లేక మామూళ్ళు సకాలంలో చెల్లిస్తుండడం వళ్ళో…వాళ్ళే కాపాడారని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మన జక్కన్న కూడా ఇంకాస్త ఎక్కువ రోజులు, ఎక్కువ ప్రచారం కోసం స్కెచ్ వేసి వ్యూహాత్మకంగా ప్రెస్‌మీట్‌లో ఈ విషయం గురించి హింట్స్ ఇచ్చాడేమో తెలియదు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఇంకేవో విషయాలు అనుకుని, ఎక్కడెక్కడో వెతికేస్తారేమోనన్న ఉద్ధేశ్యంతో ప్రభాస్ పెళ్ళి విషయం కాదని చెప్పడంతో పాటు…అలాగే మీడియా వాళ్ళు వెతికే ప్రయత్నం చేసే కొన్ని విషయాల గురించి ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. ఈ బాహుబలి డైరెక్టర్ వ్యూహాలను, తెలివితేటలను కూడా అస్సలు తక్కువ అంచనా వేయలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close