నాగ‌శౌర్య : ఆల‌స్యం అమృత‌మే!!

నాగ‌శౌర్య న‌టించిన ఓ సినిమా ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అదే… నీ జ‌త లేక‌! ఈ సినిమా గురించి ఎలాంటి ప్రచార ఆర్భాటాలూ జ‌ర‌గ‌లేదు. చ‌డీచ‌ప్పుడు లేకుండా వ‌చ్చిన ఈసినిమా దానికి త‌గ్గట్టుగానే చ‌ప్పగానే ఉంది. నాగ‌శౌర్య ఈసినిమా ఎప్పుడు చేశాడో?? అంటూ జ‌నం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ఇప్పటి సినిమా కాదు. నాలుగేళ్ల క్రిత‌మే మొద‌లై.. మ‌ధ్యలో ఆగిపోయి, నానా పాట్లూ ప‌డి చివ‌రికి పూర్తయ్యింది. చివ‌రి క్షణాల్లో డ‌బ్బుల్లేక ప‌బ్లిసిటీ కూడా చేసుకోలేక‌, న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు హ్యాండివ్వడంతో క‌నీస ప్రచారానికి కూడా నోచుకోలేక‌, చివ‌రికి ఏదో ర‌కంగా క‌ష్టప‌డి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాని చూసిన కొద్ది మంది కూడా ‘ఇదేం సినిమారా బాబూ’ అంటూ శిరోభారంతో ధియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

నిజానికి ఈ సినిమా ఆల‌స్యమ‌వ్వడం వ‌ల్ల ద‌ర్శక నిర్మాత‌ల‌కు న‌ష్టం జ‌రిగిందేమో గానీ, నాగ‌శౌర్యకు మాత్రం లాభ‌మే జ‌రిగింది. ఎందుకంటే ఊహ‌లు గుస‌గుస‌లాడే, చంద‌మామ క‌థ‌లు కంటే ముందే రావ‌ల్సిన సినిమా ఇది. బ‌హుశా ఇదే త‌న తొలి సినిమాగా విడుద‌లై ఉంటే.. నాగ‌శౌర్యకు ఇన్ని మంచి అవ‌కాశాలు వ‌చ్చేవి కావు. ఎందుకంటే ఈ సినిమాలో శౌర్య న‌ట‌న‌, అత‌ని పాత్ర అంత పూర్‌గా ఉన్నాయి. ఈ సినిమా చూసే నాగ‌శౌర్యని జ‌డ్జ్ చేయాల్సివ‌స్తే త‌ప్పకుండా తేలిపోయేవాడు. అందుకే ఈ సినిమా ఆల‌స్యం అవుతున్న కొద్దీ.. నాగ‌శౌర్య సంతోషించాడేమో అనిపిస్తోంది. ఎలాంటి ప్రచార ఆర్భాటాలూ లేకుండా గ‌ప్ చుప్‌గా రావ‌డం కూడా శౌర్యకు ప్లస్ పాయింటే. ఎందుకంటే ప‌బ్లిసిటీ బిల్డప్పుల‌తో హోరెత్తిస్తే.. ఈ సినిమా గురించి జ‌నానికి తెలిసేది. ఈ ఫ్లాప్ గురించి నాలుగురోజులు ఎక్కువ‌గా మాట్లాడుకొనేవాళ్లు. ఆలస్యం అమృతం విషం అంటారు. ఈ సినిమా ఆల‌స్యం మాత్రం అమృతం పోసింది. ఈ ఫ్లాప్ త‌న ఖాతాలో ఎక్కకుండా సాయం చేసింది. క‌లిసొచ్చే రోజులొస్తే ఇలానే ఉంటుంది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close