మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ని హోస్ట్ చేయబోతున్నారని తెలియగానే చాలా మందికి వచ్చిన సందేహం…చిరంజీవి ఆ పాత్రకు జీవం పోయగలరా అని. చిరంజీవి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పే ఎంఈకె టీం ఉంటుంది. కెమేరాకు ఎధురుగా వచ్చి ఆ మాటలకు జీవం పోయడమే మెగాస్టార్ డ్యూటీ. సినిమాల విషయం పక్కన పెడితే సినిమా వేదికలు, రాజకీయ సభలు…ఈవెన్ ప్రెస్ మీట్స్‌లో కూడా చిరంజీవి మాటలు చాలా చాలా డ్రమెటిక్‌గా ఉంటాయి. కెరీర్ ప్రారంభం నుంచి కూడా ఆచితూచి మాట్లాడాలి, ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి లాంటి ఆలోచనలతో ఉండేవాడు చిరంజీవి. ఆ ఆలోచనలే చిరంజీవి ప్రవర్తనను ప్రభావితం చేశాయి. ఈ రోజు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలో కూడా అదే కనిపించింది.
నాగార్జున కంటే హ్యాండ్సమ్గా కనిపించాలని చేసిన ప్రయత్నం వర్కవుట్ అయింది. మేకప్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. డైలాగ్ కూడా అదిరిపోయింది. కానీ చిరంజీవి నడుచుకుంటూ వచ్చిన విధానం, ఆ డైలాగ్ పలికిన విధానం, చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా సినిమాటిక్‌గా ఉన్నాయి. పిచ్చ డ్రమెటిక్‌గా ఉన్నాయి. టివి యాంకర్స్‌కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ కెమేరా ముందు జీవించటం. ఆ తర్వాత స్పాంటేనియస్‌గా స్పందించగలగడం. మాటలు వెతుక్కున్నట్టుగానో, ఎవరో రాసిన డైలాగ్స్‌ని పలుకుతున్నట్టుగానో అస్సలు ఉండకూడదు. ఇప్పటి వరకూ ఆఫ్ ది స్క్రీన్ జీవితంలో అలాంటి నేచర్ చిరంజీవిలో ఎప్పుడూ కనిపించలేదు. బోలెడంత డ్రామా మాత్రం ఉంటుంది. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో చిరంజీవి పెర్ఫార్మెన్స్ని చూసిన ఎవ్వరికైనా ఆ విషయం అర్థమయిపోతుంది. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు టీజర్లో కూడా అదే చేశాడు. ఇక రేపు గెస్ట్‌లతో ఎలా కలిసిపోతాడో? వాళ్ళను ప్రేమగా ఎలా దగ్గరకు తీసుకుంటాడో? ఎంత స్పాంటేనియస్‌గా స్పందిస్తూ హాస్యాన్ని పండిస్తాడో? నాగార్జున కంటే బెటర్‌గా షోని ఆసక్తికరంగా ఎలా మలుస్తాడో చూడాలి మరి. ఆ విషయంలో సక్సెస్ అయితే మాత్రం చిరంజీవి ఇమేజ్ కూడా చాలా పెరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.