తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరిలోకి ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఒక సారి సూపర్ స్టార్ ఢం వచ్చిన తర్వాత… తనతో సినిమా చేయమని చెప్పి ఎవరైనా ఓ డైరెక్టర్ని అడగాలంటే మన స్టార్ హీరోలకు మహా నామోషి. బోలెడంత ఇగో అడ్డొస్తుంది. పైగా ఆ విషయాన్ని పబ్లిక్‌గా బహిరంగ వేదికలపైనే చెప్పేస్తూ ఉంటారు. నాతో సినిమా చేయమని చెప్పి ఎప్పుడూ, ఏ డైరెక్టర్ని కూడా అడగలేదు అని గర్వంగా చెప్తూ తమ ఇగోనంతా బయటపెట్టేసుకుంటూ ఉంటారు. అయితే ఎన్టీఆర్‌కి మాత్రం ఆ విషయంలో ఎలాంటి ఇగో లేదు. తను నటుడిగా ఒక్కో సినిమాతో నెక్ట్స్ స్టేజ్‌కి వెళుతూ ఉండాలి. కమర్షియల్‌గా కూడా మంచి హిట్స్ కొడుతూ ఉండాలి. అందుకోసం తనకు నచ్చిన ఏ డైరెక్టర్ని అయినా సరే, తనతో సినిమా చేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు.
అందుకే నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి మరీ హైదరాబాద్ వచ్చి కొరటాల శివను కలిశాడు. తనతో సినిమా చేసేలా శివను ఒఫ్పించాడు. అది ఎన్టీఆర్‌కి చాలా చాలా ప్లస్ అయింది. జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా, నటుడిగా కూడా అద్భుతమైన ప్రశంశలు అందుకున్నాడు. అంతకుముందు కూడా రాజమౌళి, వినాయక్‌లతో సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపించేవాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాలో తనను సరికొత్తగా ప్రజెంట్ చేసి క్లాస్ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సుకుమార్‌కి కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు ఎన్టీఆర్. తనతో సినిమా చేయడానికి సుకుమార్ ఎప్పుడు ముందుకు వచ్చినా సరే కథ కూడా వినకుండా ఒకె చేసేస్తానని చెప్పేశాడు.
ఈ డైరెక్టర్స్ అందరిలాగే ఎన్టీఆర్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నా కూడా చాలా అభిమానం. బేసిక్‌గా రైటర్స్‌ని ఇష్టపడే నేచర్ ఉన్న ఎన్టీఆర్‌కి త్రివిక్రమ్ రచనా శైలి అంటే చాలా ఇష్టం. అందుకే త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అనేక కారణాల వళ్ళ ఇప్పటి వరకూ ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. జనతా గ్యారేజ్ తర్వాత కూడా ఎన్టీఆర్ ఓ ప్రయత్నం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్న ఆబ్లిగేషన్ ఉండడంతో త్రివిక్రమ్ నో చెప్పేశాడు. అయితే ఇప్పుడు సడన్‌గా కాటమరాయుడుతో పాటు వేదాళం సినిమా రీమేక్‌కి కూడా పవన్ కళ్యాణ్ పచ్చజెండా ఊపేయడంతో త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ చేత ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేయించే ప్రయత్నాల్లో కొంతమంది ప్రముఖ నిర్మాతలే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంబినేషన్‌ని ఎవరు సెట్ చేస్తే వాళ్ళకు సినిమా చేసి పెట్టడానికి ఎన్టీఆర్ రెడీగానే ఉన్నాడు. జరుగుతున్న పరిణామాలన్నీ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్న పరిశీలకులు కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు.