ఆ ‘బ‌ద్మాష్’ హీరో ఎవ‌రో మ‌రి!

ఇటీవ‌ల రీమేక్ చిత్రాల హ‌వా తెలుగు నాట మ‌రింత ఎక్కువైంది. మ‌ఖ్యంగా మెగా హీరోలు రీమేక్‌ల‌నే న‌మ్మ‌కొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న రెండు సినిమాలూ రీమేక్‌లే. చిరు 150వ చిత్రం క‌త్తికి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ సినిమా ధృవ కూడా త‌మిళ సినిమా త‌ని ఒరువ‌న్ కి రీమేకే. ఇప్పుడు బ‌న్నీ కూడా అదే బాట‌లో వెళ్తున్న‌ట్టు స‌మాచారం. అల్లు అర్జున్ దృష్టి ఓ క‌న్న‌డ సినిమాపై ప‌డింద‌ని, దాన్ని రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ని స‌మాచారం.
క‌న్న‌డ‌లో ధ‌నుంజ‌య్ హీరోగా బ‌ద్మాష్ అనే సినిమా త‌యార‌వుతోంది. ఈసినిమా గురించి తెలుసుకొన్న బ‌న్నీ.. రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని, బ‌ద్మాష్ విడుద‌ల కాక‌ముందే.. ఆ సినిమాపై క‌ర్చీఫ్ వేశాడ‌ని చెబుతున్నారు.

బ‌ద్మాష్ అనేది ఓ మాస్, రొమాంక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్ సినిమా త‌ర‌హాలో ఉండ‌బోతోంద‌ట‌. అయితే ఆ కాన్సెప్ట్ న‌చ్చి.. ఎందుకైనా ప‌నికొస్తుంద‌ని ముందుగా రీమేక్ రైట్స్ పై ఓ క‌న్నేశాడ‌ట బ‌న్నీ ఈ సినిమాని బ‌న్నీ అయినా, అల్లు శిరీష్ అయినా చేయొచ్చ‌ని టాక్‌. లేదంటే గీతా ఆర్ట్స్ ఇప్పుడు బ‌య‌టి హీరోల‌తో విరివిగా సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తోంది. మ‌రోవైపు పీవీపీ సంస్థ కూడా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాక్‌. ఓ క‌న్న‌డ సినిమాకు విడుద‌ల‌కు ముందే ఇంత పోటీ ఏర్ప‌డిందంటే.. క‌చ్చితంగా అందులో విశేషం ఉండే ఉంటుంది. మ‌రి ఇక్క‌డ బ‌ద్మాష్ గా క‌నిపించే ఆ హీరో ఎవ‌రో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close