సినిమా వాళ్ళకు, పొలిటీషియన్స్‌కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాకపోతే పాలిటిక్స్‌లో ఉన్నవారందరూ రాజకీయాలే చేస్తూ ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రం అదేపనిగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. కుట్రలు, కుతంత్రాల విషయంలో రాజకీయ నాయకులకు వీళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ప్రతిభతో పైకొస్తున్నవాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాగే నీచమైన పాలిటిక్స్ చేస్తూ పక్కవాడు నాశనమైపోవాలి అని కోరుకునేవాళ్ళు కూడా మన ఇండస్ట్రీలో అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు.
ఆ విషయం పక్కన పెడితే బాలీవుడ్లో ఉన్న ఓ జీవి కమల్ ఆర్ ఖాన్. నటుడని, క్రిటిక్ అని ఇతగాడిని సంబోధించడం అంటే ఆయా వృత్తులను అవమానించడమే. డబ్బు తీసుకుని ఎవరినో ఒకరిని విమర్శిస్తూ…ఎవరి జీవితాలకో, సినిమాలకో నష్టం చేస్తూ… తాను బాగుపడుతున్నాననుకునే అథమ స్థాయి రకం జీవి అనొచ్చు. మనవాడి చీప్ క్యారెక్టర్ గురించి ప్రపంచానికి తెలియచేశాడు అజయ్ దేవగణ్. అనుష్క శర్మ కెరీర్‌కి నష్టం చేయాలని అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశానని కరణ్ జోహార్ అన్న మాటలను పరిశీలిస్తే… తన సినిమాకి పోటీగా వస్తున్న శివాయ్ సినిమాని తొక్కెయ్యడానికి కూడా కమల్ ఆర్ ఖాన్‌కి కరణ్ జోహార్ డబ్బులిచ్చి ఉంటాడనే అనుమానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. కమల్ ట్వీట్స్ కూడా ఆ విషయాన్ని విస్సష్టంగా తెలియచేస్తున్నాయి.
కరణ్-కమల్‌ది బాలీవుడ్ గొడవ. ఆ విషయం పక్కన పెడితే మరి ఇదే కమల్ ఆర్ ఖాన్ చేతి పవన్ కళ్యాణ్ సినిమాని, పవన్‌ని తిట్టించిన వారు ఎవరు? వందకోట్లు కొల్లగొట్టాలన్న టార్గెట్తోనో, లేకపోతే బాలీవుడ్ హీరోగా సెటిల్ అయిపోవాలన్న టార్గెట్తోనో సర్దార్ సినిమాని బాలీవుడ్లో రిలీజ్ చేయలేదు పవన్. ఓ ఐదు కోట్ల మార్కెట్ పెరిగినా… ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతకు కాస్త మంచిదే కదా అన్న ఉద్ధేశ్యంతో సర్ధార్ సినిమాని హిందీలో కూడా డబ్ చేయించాడు. ఆ లెక్కన చూసుకుంటే…హిందీ వరకూ సర్ధార్ గబ్బర్ సింగ్ చాలా చాలా చిన్న సినిమా. అది కూడా డబ్బింగ్ సినిమా. పైగా పవన్ కళ్యాణ్‌కి హిందీలో పెద్దగా ఫాలోయింగ్ ఏమీ లేదు. మరి అలాంటి చిన్న సినిమాని కమాల్ ఆర్ ఖాన్ ఎందుకు టార్గెట్ చేశాడు? సర్దార్ సినిమాకి ఆ రేంజ్ అయితే కచ్చితంగా లేదు. సర్ధార్ సినిమా కమల్‌కి నచ్చక తిట్టేశాడేమోనని సరిపెట్టుకుందామన్నా…. కమల్ విమర్శలలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాగాలేదు అని చెప్పే ప్రయత్నం కంటే కూడా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్కిల్స్‌ని, వ్యక్తిత్వాన్ని కించపర్చాలన్న నీచమైన ఆలోచనలు కనిపించాయి. పవన్-కమల్‌కి వ్యక్తిగతంగా ఎలాంటి వైరం ఉండే అవకాశం లేదు. మరి పవన్ కళ్యాణ్‌ని విమర్శించమని కమాల్ ఆర్ ఖాన్‌కి డబ్బులిచ్చిన ఆ సినిమా సెలబ్రిటీ ఎవరు? కరణ్ జోహార్-కమల్ ఆర్ ఖాన్ల నీచమైన డీల్‌ని అజయ్ దేవగణ్ బయటపెట్టేశాడు. మరి పవన్ కళ్యాణ్‌ని తిట్టించడానికి కమాల్ ఆర్ ఖాన్‌కి డబ్బులిచ్చిన ఆ ———- పేరుని ఎవరు బయటపెడతారు?