రెగ్యులర్ మాస్ మసాల స్టఫ్‌ని సక్సెస్ చేసే స్థాయిని ఎప్పుడో దాటేశారు ప్రేక్షకులు. అయితే అలాంటి మాస్ ఎలిమెంట్స్‌తోనే సింగం సిరీస్ సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టేస్తున్నాడు సూర్య. మధ్యలో సింగం-2 రిజల్ట్ కాస్త అటూ ఇటూగా అనిపించింది కానీ ఈ సారి సింగం-3తో మాత్రం అన్నీ పక్కాగా సెట్ చేసినట్టున్నారు. సూర్యతో… ‘ఇండియన్’ అని అరిపించడం, సింహాన్నిరా అని చెప్పే డైలాగ్ లాంటి వాటిని మాస్‌కి ఎక్కేలాగే డిజైన్ చేశారు. ఇక సింగం సిరీస్ సినిమాల హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుష్క, శృతీహాసన్ లాంటి ఇద్దరు టాప్ రేంజ్ హీరోయిన్స్ ఈ మూడో సింగంలో ఉన్నారు.
సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ సింగం పోలీస్ క్యారెక్టర్ని మనవాడు నరనరానా డైజెస్ట్ చేసుకున్నట్టున్నాడు. డైలాగ్ డెలివరీ, లుక్స్, ఫిజిక్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఈ సారి కాస్త కొత్తగా కూడా ట్రై చేసినట్టున్నాడు. ఇక మగధీర సినిమా తర్వాత నుంచీ కూడా గుర్రమెక్కాలన్న ఉబలాటాన్ని దాచుకోలేకపోతున్న మన తెలుగు స్టార్ హీరోస్లానే ఈ సింగం కూడా గుర్రం ఎక్కేసింది. రేసీ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్‌కి బోర్ కొట్టకుండా చేయడంలో హరి సిద్ధహస్తుడు. ఈ సారి టీజర్లో కూడా అదే మార్క్ చూపించాడు. నిమిషం నిడివికి అటూ ఇటూగా ఉన్న టీజర్లో హరి చూపించినన్ని షాట్స్ చూపించడం వేరే డైరెక్టర్స్‌కి సాధ్యం కాదేమో. మరి ఈ అరుపులు, కేకలు, పెడబొబ్బల స్పెషల్ సింగం ఈ సారి ఏ రేంజ్లో గర్జిస్తుందో చూడాల్సిందే.