అవినీతిపరులు, అక్రమార్కులు, క్రిమినల్స్ గురించి డీటెయిల్డ్‌గా వార్తలు రాయాలంటే మన మీడియాకు బోలెడన్ని మొహమాటాలు ఉంటాయి కానీ సినిమా స్టార్స్ అంటే మాత్రం పోలోమని రెడీ అయిపోతూ ఉంటారు. అలా రాసే వార్తలకు ఆధారాలు ఎలాగూ ఉండవు. కనీసం కామన్ సెన్స్ కూడా అస్సలు వాడకుండా రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక తెలుగు గ్రేట్ సైట్లో అలాంటి వార్తను ఒకదాన్ని వండివార్చిపడేశారు.
ఎన్టీఆర్‌కి మహేష్ బాబుకి అస్సలు పడదని వాళ్ళే సర్టిఫై చేసేశారు. అలా ఎందుకు అనేదానికి సంబంధించి కూడా వాళ్ళే ఓ భారీ బాహుబలి సినిమా రేంజ్ కథను అల్లిపడేశారు. 2009లో టిడిపి తరపున యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన రాజకీయ ప్రచారం గుర్తుందిగా…? ఆ ప్రచారాన్ని, ఎన్టీఆర్ మాటలను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరులే. ఆ ఎన్నికల మొత్తం మీద కూడా ది బెస్ట్ క్యాంపెయినర్‌గా ఎన్టీఆరే నిలిచాడన్నది వాస్తవం. ఆ ఎన్నికల ప్రచారం సమయంలోనే మహేష్ బాబు బావ గల్లా జయదేవ్…మహేష్‌ని ఓ ఫేవర్ అడిగాడట. జయదేవ్ మదర్ గల్లా అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా ఎన్టీఆర్‌ని ఓ మాట అడగమని మహేష్‌కి చెప్పాడట. బావ రిక్వెస్ట్‌కి ఒప్పుకున్న మహేష్ వెంటనే ఎన్టీఆర్‌కి కాల్ చేశాడట. గల్లా అరుణ కుమారి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చెయ్యొద్దని ఎన్టీఆర్‌ని రిక్వెస్ట్ చేశాడట. వెంటనే రియాక్ట్ అయిన ఎన్టీఆర్…‘రిక్వెస్ట్ కాదు మహేష్…ఆర్డర్ వెయ్యి…’అని మహేష్‌తో చెప్పాడట. మహేష్ బాబు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడట.
అయితే ఆ తర్వాత రోజు న్యూస్ పేపర్స్ చూసిన మహేష్ షాక్ అయ్యాడట. గల్లా అరుణకుమారి నియోజకవర్గంలో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేసేశాడట. ఆ ఫొటోలు చూసి ఎన్టీఆర్ ప్రచారం చేసిన విషయం తెలుసుకున్న మహేష్ అప్పటి నుంచీ ఎన్టీఆర్‌కి దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాడట.
అంతా బాగుంది. స్టోరీ అదిరిపోయింది. కాకపోతే కొన్ని లాజిక్‌లు మాత్రం మిస్సవుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాకు మహేష్ బాబు ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు? ఎన్టీఆర్ వివాహంతో సహా ఆ తర్వాత చాలా సందర్భాల్లో మహేష్-ఎన్టీఆర్‌లు కలుసుకున్నారుగా. అయినా ఎన్టీఆర్ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో డిసైడ్ చేసింది చంద్రబాబునాయుడు అన్న విషయం సీనియర్ పొలిటీషియన్ గల్లా అరుణ కుమారి, జయదేవ్, మహేష్ బాబులకు తెలియదా? ఇలాంటి వార్తలు చూసినప్పుడే వోడ్కా ఏసి ట్వీట్స్ చేసే వర్మకంటే మీడియా ఇంకా అథమస్థాయిలో ఉందేమో అనిపిస్తూ ఉంటుంది.
లాస్ట్ పంచ్ః ఎన్టీఆర్ ప్రచారం మొత్తానికి బోలెడన్ని ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇచ్చాయి కదా. మరి మహేష్‌బాబుకు మరుసటి రోజు న్యూస్ పేపర్ చదివేవరకూ ఆ విషయం ఎలా తెలియకుండా పోయిందబ్బా? కనీసం గల్లా అరుణ, జయదేవ్‌లు అయినా మహేష్‌కి ఫోన్ చేసి చెప్పలేదా? లేకపోతే వాళ్ళు కూడా మరుసటి రోజు పేపర్ చూసే ఎన్టీఆర్ ప్రచారం విషయం తెలుసుకున్నారా?