తలసాని శ్రీనివాసయాదవ్ కూతురుని ఆశీర్వదించడానికి సినిమా తారలందరూ వెళ్ళారు. మామూలుగా అయితే సినిమా ఇండస్ర్టీలో బోలెడన్ని వర్గాలు, కులాలు, ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. ఆ ఫంక్షన్‌కి వాడొస్తే నేను రాను అని చెప్పే స్టార్స్ కూడా చాలామందే ఉన్నారక్కడ. కానీ సినిమాటోగ్రఫి మంత్రివర్యులు అయిన తలసాని ఇంటికి మాత్రం అలాంటి షరతులేమీ లేకుండా స్టార్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఇప్పుడిదే విషయం గురించి సోషల్ మీడియా జీవులతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు.
వందల కోట్ల రూపాయల వ్యవహారంతో ముడిపడి ఉండే చాలా రకాల బిజినెస్‌లలో ఉన్నట్టుగానే సినిమా వ్యాపారంలో కూడా లోపాలు, లొసుగులు అనేకం ఉంటాయి. అసలే మనవాళ్ళకు ట్యాక్స్‌లు కట్టాలంటే అస్సలు మనసు రాదు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పార్టీలు చేసుకుంటారు కానీ ప్రభుత్వానికి పన్నులు కట్టాలంటే మాత్రం గింజుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్‌తో సహా బోలెడన్ని బిజినెస్‌లలో సినిమావాళ్ళు పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటారు. వాటన్నింటికీ రాజకీయ నాయకుల అండదండలు కావాలి. నిజాయితీగా చెప్పాలంటే ఈ నాయకులే సినిమావాళ్ళ బ్లాక్ మనీని ఎలా డబుల్ చేసుకోవాలి? ఎలా వైట్ చేసుకోవాలి? ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? లాంటి విషయాల్లో వాళ్ళకు సలహాలిస్తారు. అలాగే నయిూంలాంటి వాళ్ళతో ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఈ నాయకులే మధ్యలోకి ఎంటర్ అయి సెటిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సెటిల్మెంట్స్ చేయడంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్స్పర్ట్ అన్న విషయం బహిరంగ రహస్యం. ఆపైన అధికారంలో కూడా ఉన్నాడు. అది కూడా సినిమావాళ్ళకు సంబంధించిన మంత్రి. అలాంటి తలసానితో ఈ తారలందరికీ బోలెడన్ని అవసరాలు…ఆమ్యామ్యా వ్యవహారాలు ఉంటాయి కదా. మరి హాజరవకపోతే ఎలా?
తలసాని శ్రీనివాస యాదవ్‌కి మంత్రి పదవి లేకపోయి ఉండి ఉంటే ఈ తారలందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు క్విడ్ ప్రో ఖో కిందకు రావేమో.