ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంత వచ్చే యేడాది పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2017 ఆగస్టులో వీరిద్దరి పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది. అందుకు చాలా సమయం ఉన్నా.. సమంత మాత్రం చాలా తొందర పడిపోతోందట. కొత్త కాపురానికి తగిన ఏర్పాట్లలో సమంత బిజీగా ఉందని తెలుస్తోంది. నాగచైతన్య ముందు నుంచీ వేరుగా, ఓ ఫ్లాటులో ఉంటున్నాడు. ఇప్పుడు అదే ఫ్లాటులోకి సమంత కూడా షిఫ్ట్ అయిపోయింది. అంతేకాదు.. పెళ్లయ్యాక ఎక్కడ ఉండాలో అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. జూబ్లి హిల్స్ లో ఓ ఫ్లాట్ ని కొని అక్కడ విలాసవంతమైన విల్లా కట్టాలని సమంత- చైతూ భావిస్తున్నార్ట. నాగచైతన్య ఇప్పటికే ఆ ప్లేస్ చూసేశాడని, అక్కడ సమంత తన అభిరుచి మేర ఓ విల్లాని కట్టించనున్నదని తెలుస్తోంది. ఈమద్య సమంత సినిమాలేం చేయడం లేదు. కాబట్టి.. తగినంత ఫ్రీ టైమ్ దొరికింది. ఈలోగా ఇంటికి సంబంధించిన విషయాల్లో తలమునకలైపోయిందని సమాచారం. తనకు బాగా తెలిసిన ఇంజనీర్లతో ఇంటి గురించిన ప్లాన్స్ విషయంలో డిస్కర్షన్స్ మొదలెట్టేసిందట సమంత. చైతూ కూడా ఇంటికి సంబంధించిన బాధ్యత సమంతకే అప్పగించాడని తెలుస్తోంది.
హైదరాబాద్లో ఇల్లు కట్టుకొన్నా, చెన్నైలో కూడా ఓ ఫ్లాట్ ఉండాల్సిందే అని సమంత పట్టుబడుతోందట. ఎందుకంటే సమంత ఇటు తెలుగుతో పాటు, అటు తమిళ సినిమాలూ చేస్తోంది. దానికి తోడు చైతూ కూడా తమిళంలో ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. అన్నింటి కంటే ముఖ్యంగా సమంత స్నేహితులు ఎక్కువగా చెన్నైలోనే సెటిల్ అయ్యారు. చైతూ బాల్యం కూడా అక్కడే గడిచింది. వీటన్నింటితో పాటు తమిళ చిత్రసీమకూ దగ్గరగా ఉండాలంటే చెన్నైలోనూ ఓ ఫ్లాట్ కొనడమే మంచిదని సమంత, చైతూలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి కొత్త కాపురాన్ని ఎలా నడపాలో సమంత అప్పుడే ఓ క్లారిటీ కి వచ్చేసిందన్నమాట. సమంత సినిమాలు ఒప్పుకొనే విషయంలో తొందర పడకపోవడానికి కారణం.. ఈ ఇంటి బాధ్యతలూ ఓ కారణమని తెలుస్తోంది.