రచ్చ సినిమా నుంచి బ్రూస్ లీ వరకూ ఒకే తరహా సినిమాలు, సేం టు సేం ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్‌తో ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా విసిగించిన చరణ్ ధృవ సినిమా ట్రైలర్లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఎట్ లీస్ట్ కొత్తగా కనిపించడానికి చాలా చాలా ట్రై చేశాడు. అది కొంత వరకూ వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. డైలాగ్ డెలివరీతో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ చరణ్ వరకూ చూసుకుంటే మాత్రం కొంత మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అలాగే మొదటి సినిమా ‘అతనొక్కడే’ సినిమాతోనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ని డైరెక్ట్ చేయగలనని నిరూపించుకున్న సురేందర్‌రెడ్డి ధృవ సినిమాతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకునేలానే ఉన్నాడు. ఒరిజినల్ థనీ ఒరువన్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్లో తెరకెక్కించే అవకాశం రావడంతో సురేందర్‌రెడ్డి తన టాలెంట్ మొత్తం చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో సురేందర్‌రెడ్డి అండ్ టీం చేసిన హార్డ్ వర్క్ తెరపైన కనిపిస్తోంది. చరణ్ మేకోవర్ కూడా ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్కి బాగానే ప్లస్ అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్‌ని మెప్పించడం కోసం అని చెప్పి ఒరిజినల్ స్టోరీని చాలా చాలా మార్చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ట్రైలర్ వరకూ చూసుకుంటే మాత్రం కంటెంట్ మొత్తం కూడా థనీ ఒరువన్ సినిమా నుంచీ కాపీ పేస్ట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఆ కంటెంట్‌ని స్టైలిష్‌గా తెరకెక్కించడం, రామ్ చరణ్‌ని కొత్తగా ప్రజెంట్ చేయడంపైనే సురేందర్‌రెడ్డి కాన్సన్ట్రేట్ చేశాడని తెలుస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ధృవ ట్రైలర్‌కి పాజిటివ్ మార్కులే వెయ్యొచ్చు.