ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ సంబరపడిపోతున్నాడు చరణ్. అవును మరి… రాక రాక ఓ హిట్టొచ్చింది. తని ఒరువన్కి రీమేక్‌గా వచ్చిన ధృవ.. బాక్సాఫీసు దగ్గర నిలదొక్కుకొంది. పదేళ్ల నుంచి ఓవర్సీస్ మార్కెట్‌పై వీర పోరాటం చేస్తూ… చేస్తూ ఇప్పుడు అక్కడ తన సినిమాని వన్ మిలియన్ క్లబ్లో చేర్చుకోగలిగాడు. ఈ క్షణాల కోసం ఎంతగా ఎదురు చూశాడో? అందుకే వాటిని ఆస్వాదించడం మొదలెట్టాడు. రిలీజ్‌కి ముందే చరణ్ అమెరికా వెళ్లిపోయాడు. ధృవ హిట్ ఖాయమయ్యాకే అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. వచ్చాక ఇక్కడ హల్ చల్ చేయడం మొదలెట్టాడు. ఉపాసనతో కలసి బుధవారం రాత్రి జీవీకే మాల్లో ‘ధృవ’ షో ప్రేక్షకులతో కలసి చూశాడు. తనతో పాటు ఉపాసననీ తీసుకొచ్చాడు. చరణ్‌నీ, ఉపాసననీ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. వాళ్ల సందడి, సినిమాపై రియాక్షన్ కళ్లార చూసి హ్యాపీగా ఇంటికెళ్లిపోయాడు చరణ్.
ధృవ ప్రమోషన్లు యావరేజ్‌గా మొదలయ్యాయి. చివర్లో చరణ్ జోక్యంతో ప్రచారం కాస్త ఉధృతంగానే చేశాడు. రిలీజ్ తరవాత మళ్లీ ప్రమోషన్లు డీలా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ చరణ్ రంగ ప్రవేశం చేద్దామనుకొంటున్నాడు. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి.. వసూళ్లకు ఊపు తీసుకొద్దామన్న ప్లాన్‌లో ఉన్నాడు. ధృవ ఓవరాల్ గా రూ.40 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ అంకె ఈజీగా అందుకోవాలన్నా.. తన సినిమాని రూ.50 కోట్ల క్లబ్‌కి దగ్గరగా తీసుకెళ్లాలన్నా… ప్రమోషన్లపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే చరణ్ ఆ దిశగా ఆలోచించడం మొదలెట్టాడు. ఇంట్లో షో వేసుకొని చూసుకొనే కెపాసిటీ ఉన్నా.. ఉపాసనతో కలసి థియేటర్లోకి అడుగుపెట్టాడంటే అది కూడా ప్రచారంలో భాగమే అని ప్రత్యేకంగా చెప్పాలా??