అదేంటో… ప‌వ‌న్ చెబితేనే చంద్ర‌బాబుకి అర్థ‌మౌతుంది!

సాధార‌ణంగా… ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి ప్ర‌తిప‌క్షం మాట్లాడాలి. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటాలు చేయాలి. ఆ త‌రువాత ప్ర‌భుత్వం స్పందించి… స‌ద‌రు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలి. అధికార ప‌క్షం ఏదైనా స‌రే… ప్ర‌తిప‌క్షం ఎత్తిచూపే స‌మ‌స్య‌ల‌పై స్పందించాలి. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు స‌ర్కారు మాత్రం ఇందుకు భిన్నం! ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏ స‌మ‌స్య లేవ‌నెత్తినా చంద్ర‌బాబు స్పందించ‌రు. పైగా, విప‌క్షం చేసే విమ‌ర్శ‌ల‌కి రాజ‌కీయ కోణం ఆపాదించి.. తిప్పి కొట్టేస్తుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే… జ‌న‌సేన అధినేత ఏ స‌మ‌స్య గురించి మాట్లాడినా ముఖ్యమంత్రిగానీ, ఇత‌ర మంత్రులుగానీ వెంట‌నే స్పందించేస్తుంటారు! ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేస్తుంటారు.

ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలోని కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారి గురించి ఈ మ‌ధ్య ప‌వ‌న్ స్పందించిన సంగ‌తి తెలిసిందే. నిజానికి అక్క‌డ ఎప్ప‌టి నుంచో ఈ స‌మస్య ఉంది. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు స్థానిక తెలుగుదేశం నేత‌ల‌కు తెలియ‌కుండా ఉంటాయా..! కానీ, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ స‌మ‌స్య గురించి స్పందించేస‌రికి… స‌ర్కారులో చ‌ల‌నం వ‌చ్చేసింది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జ‌రిగినా డాష్ బోర్డ్ మీద ప్ర‌త్య‌క్షం అవుతుంద‌ని చెప్పుకునే హైటెక్ ముఖ్య‌మంత్రికి… ఎన్నోయేళ్లుగా శ్రీ‌కాకుళం జిల్లా ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు తెలియ‌కుండా ఉంటాయా చెప్పండీ. డాష్ బోర్డులో ఇలాంటివేవీ క‌నిపించ‌వా..? ఏదైతేనేం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్ప‌గానే వెంట‌నే స్పందించేశారు. స‌మ‌స్య‌పై దృష్టి సారించేశారు.

ఇదే కాదు.. ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ టేక‌ప్ చేసిన ఆక్వా ఫుడ్ పార్క్ రైతుల స‌మ‌స్య‌లో కూడా ఇంతే! తొందుర్రు రైతుల‌కు మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ నిలిచారు. ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్య‌తిరేకించారు. ప‌వ‌న్ ఎంట్రీతో చంద్ర‌బాబు స‌ర్కారు కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్టే అనిపించింది. కానీ, ఆ త‌రువాత జ‌ర‌గాల్సింది కాస్తా జ‌రిగిపోయింది. ఆక్వాపార్క్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌నీ, ప‌నుల వేగం పెంచాల‌ని ఓ స‌మీక్ష స‌మావేశంలో సీఎం ఆదేశించేశారు. అంత‌కుముందు రాజ‌ధాని ప్రాంత నిర్వాసిన రైతుల విష‌యంలోనూ అంతే. ప‌వ‌న్ స్పందించిన వెంట‌నే చంద్ర‌బాబు స‌ర్కారు ప్ర‌తిస్పందించేసింది.

ఏదైనా ఒక స‌మ‌స్య ప‌వ‌న్ దృష్టికి రాగానే ఆయ‌న ఆవేశంగా స్పందించేస్తారు. వెంట‌నే, చంద్ర‌బాబు స‌ర్కారులో కూడా క‌దిల‌క వ‌చ్చేస్తుంది. అంతే… అక్క‌డితో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖుషీ అయిపోయి త‌న పోరాటాన్ని విర‌మించుకుంటారు. ప్ర‌తిప‌క్ష వైకాపా అధినేత జ‌గ‌న్ చేసే పోరాటాల‌పైనా, ఎత్తిచూపే స‌మ‌స్య‌ల‌పైనా చంద్ర‌బాబు స్పంద‌న ఇంత చురుగ్గా ఉండ‌దు ఎందుకో..? కేవ‌లం ప‌వ‌న్ చెబితే మాత్ర‌మే చంద్ర‌బాబుకు ఏ స‌మ‌స్య అయినా బాగా అర్థ‌మౌతుంది.. ఎందుక‌లా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close