పవన్ కళ్యాణ్‌కి సూపర్ క్రేజ్ రావడానికి ఒక కారణం ఆయన నటనాశైలినే. అప్పటి వరకూ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా ఎక్కువ శాతం సీరియస్‌గా ఉండే తరహా క్యారెక్టర్స్‌లోనే కనిపించేవారు.కామెడీ ఉన్నా కూడా మరీ కమెడియన్స్‌లా కనిపించడానికి ఇష్టపడేవాళ్ళు మాత్రం కాదు. ఆ బోర్డర్స్‌ని బ్రేక్ చేశాడు పవన్. కామెడీ ఎక్కువ…హీరోయిజం తక్కువ ఉండేలా తన యాక్టింగ్ శైలిని మార్చుకున్నాడు. తెలుగు సినిమాలు మరీ టూ మచ్‌గా కామెడీకి పెద్ద పీట వేసిన ట్రెండ్ కూడా అదే. జనాలు కూడా బాగా కనెక్ట్ అయిపోవడంతో పవన్‌కి కూడా వెంటనే స్టార్ ఢం వచ్చేసింది. పవన్ శైలిని విమర్శించే క్రిటిక్స్ కూడా చాలా మందే ఉన్నారు గానీ నచ్చినవాళ్ళు మాత్రం భక్తులయిపోయారు. ఆ భక్లులను వీరభక్తులుగా మార్చుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. సినిమాలంటే ఇష్టం లేదు, హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్ అంటే సిగ్గుపడిపోతాను, యంగ్ ఏజ్‌లోనే అడవుల్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను…అంటూ పవన్ చెప్పే గొప్ప గొప్ప మాటలకు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. అలాగే కెరీర్ ప్రారంభం నుంచి కూడా మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చాడు పవన్. మొదట్లో మీడియానే పవన్‌ని పట్టించుకోలేదు. ఆ తర్వాత మీడియా అవసరం పవన్‌కి లేకుండా పోయింది. ఇప్పుడు పాలిటిక్స్‌లో కూడా అదే మార్గాన్ని ఫాలో అవుతున్నాడు పవన్. సందర్భం వచ్చినప్పుడల్లా లోతైన అర్థం ఉండే గొప్ప పొలిటికల్ కొటేషన్స్‌ని కోట్ చేస్తున్నాడు. మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటున్నాడు. తనకు కలవాలనిపిస్తేనే, తనకు స్పందాలని అనిపిస్తేనే స్పందిస్తున్నాడు. లక్కీగా తెలుగు జనాల ఆలోచనలను చాలా ఎక్కువగా ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్న చంద్రబాబు అనుకూల మీడియా అంతా కూడా పవన్‌కి బాకా ఊదుతూ ఉండడంతో ఆయన పని సులువైంది.
ఈ మధ్య కాలంలో రాజకీయ తెరపై కనిపించలేదు పవన్. దివాకర్ల బస్సు ప్రమాద బాధితులను పరామర్శించే కార్యక్రమం ఏమీ పెట్టుకోలేదు పవన్. కనీసం మీడియా ముందుకు అయినా వచ్చి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈ రోజు మళ్ళీ పొలిటికల్ న్యూస్‌తో ప్రజల ముందుకు వచ్చాడు పవన్. నెల్లూరు యూనివర్సిటీ విద్యార్థులు పవన్‌ని కలిశారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించమని కోరారు. షూటింగ్ గ్యాప్‌లో వాళ్ళను కలిసిన పవన్ కాసేపు వాళ్ళతో మాట్లాడాడు. ఆ విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవడం కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని పవన్ మాటిచ్చాడు. ఇంకా కొన్ని రొటీన్ పొలిటికల్ నాయకుల డైలాగులు కూడా చెప్పాడు. గంటా శ్రీనివాసరావుతో మాట్లాడతనన్నాడు. అయిపోయింది. నెల్లూరు విద్యార్థుల కోసం పోరాడడానికి రెడీ అని మీడియాలో వార్తలు రావడం గ్యారెంటీ. ఇంతకుముందు రాజధాని రైతులకు సంబంధించిన ఇష్యూ నుంచి ఇప్పటి వరకూ జరుగుతున్న రాజకీయమే కాబట్టి తర్వాత పరిణామాలు ఊహించొచ్చు. గంటా శ్రీనివాసరావు కూడా చిరంజీవికి సన్నిహితుడే కాబట్టి….ఆయన కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ చాలా కరెక్ట్‌గా మాట్లాడడని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడని…ఆ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం ఓ కమిటీ వేస్తున్నానని చెప్పినా ఆశ్ఛర్యపోవాల్సిన అవసరం లేదు. అంతటితో ఈ సమస్యకు శుభం కార్డ్. సమస్య పరిష్కారం అయిందా…లేదా అనే విషయం ఎవరు పట్టించుకుంటాడు. పవన్ కళ్యాణ్ రాజకీయం ఇలా ఉంటే మాత్రం పవన్‌కి మామూలుగా ప్లస్ అవదు. 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చినప్పుడు రాజధాని రైతుల కోసం పోరాడా, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించమని చెప్పి ప్రభుత్వంతో ఫైట్ చేశా అని ఘనంగా చెప్పుకోవచ్చు. 2009 నుంచి 2014 వరకూ కనిపించకుండా పోయాడు అన్న విమర్శ పవన్ పైన ఉంది. ఈ సారి ఆ ఛాన్స్ ఉండదు. పవన్ ఇప్పుడు చేస్తున్న రాజకీయం అంతా కూడా మరీ సినిమాటిక్‌గా ఉంది. పవన్‌కి చెప్పుకోవడానికి పనికొచ్చేలా ఉంది. కానీ ఈ రాజకీయంతో ప్రజలకు ఒరిగేది ఏంటి అని అడిగితే మాత్రం సమాధానం కష్టమే. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా…….. బాబు, మోడీలను గెలిపించండి….మీ బాగోగులు నేను చూసుకుంటా, మీకు అండగా ఉంటా అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాట ఇచ్చాడు పవన్. ఆ అండగా ఉండడం ఇంత సినిమాటిక్‌గా ఉంటుందని మాత్రం ఓటర్లకు అప్పుడు అర్థమైనట్టుగా లేదు. ఇప్పుడు అర్థమైనా 2019 వరకూ వెయిట్ చెయ్యడం తప్ప చేసేదేమీ లేదు.