ఉత్త‌మ బాల న‌టుడు ‘ఈగ‌’… ఉత్త‌మ విల‌న్ ‘పులి’

ఐఫా అవార్డు వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. హైద‌రాబాద్‌లోని నావోటెల్ హోటెల్‌లో మంగ‌ళవారం రాత్రి త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్ర రంగాల‌కు చెందిన న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు అవార్డులు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రానా యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. అవార్డు వేడుకలు ఈసారి కాస్త భిన్నంగా సాగాయి. రానా జోకుల‌తో.. స‌ర‌దాగా సెటైరిక‌ల్‌గా ఈ కార్య‌క్ర‌మం న‌డిచింది. ఆహుతుల‌కు వినోదం పంచ‌డంలో భాగంగా.. కొన్ని అవార్డుల్ని జంతువుల‌కు ఇచ్చారు. ఈమ‌ధ్య ద‌క్షిణాది సినిమాల్లో జంతువుల వాడ‌కం ఎక్కువైంది. దానిపై సెటైరిక‌ల్‌గా కొన్ని జంతువుల‌కు అవార్డులు ఇచ్చారు. `ఈగ‌` సినిమాలో `ఈగ‌`కు ఉత్త‌మ బాల న‌టుడి అవార్డు ద‌క్కింది. బాహుబలి ఏనుగుకి బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డు ఇచ్చారు. ఉత్త‌మ విల‌న్‌గా మ‌న్యం పులిలో హ‌డ‌లెత్తించిన పులిరాజాకి అవార్డు ద‌క్కింది. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కేట‌రిగిరీలో జురాసిక్ పార్క్‌లో క‌నిపించిన డైనోస‌ర్‌కి పుర‌స్కారం వ‌రించింది. అయితే… వాళ్లెవ్వ‌రూ అవార్డులు తీసుకోవ‌డ‌డానికి రాలేదు లెండి. అది వేరే విష‌యం.

రెహ‌మాన్ రాక‌తో ఈ వేడుక‌కు కొత్త కాంతులొచ్చాయి. అయితే క‌మ‌ల్‌హాస‌న్‌, విజ‌య్‌, మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్‌ లాంటి స్టార్లు రాక‌పోవ‌డంతో ఈ కార్య‌క్ర‌మ క‌ళ కాస్త త‌ప్పింది. దాంతో పాటు ఆడియ‌న్స్ కూడా చాలా ప‌ల‌చ‌గా క‌నిపించారు. బుధ‌వారం తెలుగు, క‌న్న‌డ సినీ రంగాల ప్ర‌ముఖుల‌కు అవార్డులు ప్ర‌దానం చేయ‌నున్నారు. ఈకార్య‌క్ర‌మానికి రానా, నాని వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అఖిల్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ డాన్సులు చేయ‌బోతున్నారు. సో.. ఈరోజు మాత్రం ఐఫా క‌ళ‌క‌ళ‌లాడిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close