మ‌హేష్‌… ఇది టూమ‌చ్‌!

మ‌హేష్ ఫ్యాన్స్ మ‌రోసారి నిరాశ‌లో కూరుకుపోయారు. ఉగాదికైనా మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ చూద్దామ‌న్న వాళ్లు మ‌రోసారి నీరుగారిపోయారు. మురుగ‌దాస్ – మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జూన్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా మొద‌లై చాలా కాల‌మైంది.. దాదాపు పూర్తి కావొచ్చింది. అయినా స‌రే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫస్ట్ లుక్ బ‌య‌ట‌కు రాలేదు. క‌నీసం టైటిల్ ఏంటో కూడా చెప్ప‌డంలేదు. మ‌హేష్ సినిమా మొద‌లైన త‌ర‌వాత చాలా పండుగ‌లు వ‌చ్చి వెళ్లిపోయాయి. మ‌హేష్ పుట్టిన రోజుకి ఫ‌స్ట్ లుక్ చూపిస్తార‌నుకొన్నారంతా. ఆ త‌ర‌వాత జ‌న‌వ‌రి 1 వ‌చ్చింది, సంక్రాంతి వ‌చ్చింది, రిప‌బ్లిక్ డే వ‌చ్చింది.. ఇప్పుడు ఉగాది కూడా వ‌చ్చి వెళ్లిపోతోంది.. కానీ.. మ‌హేష్ గిఫ్టులేం ఇవ్వ‌లేదు.

అగ్ర క‌థానాయ‌కుడి సినిమా అంటే.. పండ‌క్కో, పుట్టిన రోజుకో ఓ స్టిల్లో, టీజ‌రో విడుద‌ల చేయ‌డం రివాజు. అప్పుడే ఫ్యాన్స్‌కి నిజ‌మైన పండ‌గ‌. ఇలాంటి సంద‌ర్భం కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఇదిగో.. అదిగో అంటున్నారు త‌ప్ప‌.. ఫ‌స్ట్ లుక్ మాటెత్త‌డం లేదు. చాలా టైటిళ్లు వినిపిస్తున్నా అందులో ఖాయ‌మైన‌దేదో చెప్ప‌డం లేదు. ఫ‌స్ట్ లుక్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయించిన సినిమా ఇదొక్క‌టేనేమో. ఏదేమైనా నెలల త‌ర‌బ‌డి అభిమానుల్ని నిరీక్ష‌ణ‌లో పెట్టేయ‌డం మాత్రం టూమ‌చ్‌. ఇప్ప‌టికైనా వ‌దులుతారా… లేదంటే ఇలానే జాప్యం చేస్తారా? ఇలా ఊరించి ఊరించి ఓ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తే అది బ్ర‌హ్మాండం బ‌ద్ద‌ల‌య్యేలా ఉండాలి. సింపుల్‌గా లాగించేస్తే మాత్రం ఈ సినిమాపై నెగిటీవ్ ఇంప్రెష‌న్స్ బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close