రామ్ చరణ్ సినిమా అంటే… చిరంజీవికి సంబంధించిన రిఫరెన్సులు వాడాలని చాలామంది దర్శకులు భావిస్తుంటారు. అలా జరిగింది కూడా. ఎందుకంటే చరణ్ సినిమాలో చిరు కనిపించినా, వినిపించినా, అందుకు సంబంధించిన రిఫరెన్సులు వచ్చినా, ఫ్యాన్స్కి అంత కంటే ఆనందం ఏముంటుంది.
బుచ్చిబాబుకి కూడా సరిగ్గా ఇలాంటి ఐడియానే వచ్చింది. ‘పెద్ది’ లో జగదేక వీరుడు అతిలోక సుందరికి సంబంధించిన రిఫరెన్సు పెట్టాడు. ఓ సందర్భంలో బ్యాక్ గ్రౌండ్ లోంచి ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ పాట వినిపిస్తుంటుంది. చిరు – శ్రీదేవిల వారసులు చరణ్ – జాన్వీ కపూర్ చేస్తున్న సినిమా కాబట్టి.. ఈ రిఫరెన్స్ పెట్టడంలో అర్థం ఉంది. అందంగానూ ఉంటుంది.
కాకపోతే ఒక్కటే సమస్య. ఇలాంటి ట్రిక్కులు ఎంత మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో, అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి. సందర్భంలోంచి, ఈ సీన్ మూడ్ లోంచి, సీరియస్ నెస్ నుంచి ఆడియన్స్ పూర్తిగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అది సినిమాకు మంచిది కాదు. అందుకే.. ఇప్పుడు బుచ్చిబాబు ఆ రిఫరెన్స్ సీన్ ని తీసేశాడట. నిజంగానే ఇది మంచి నిర్ణయం. ఫ్యాన్స్ ని కాసేపు అలరించడం కంటే, కథలో ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టడమే ముఖ్యం అని బుచ్చిబాబు నమ్మాడంటే తాను రియాలిటీలో ఉన్నట్టే లెక్క.
మరి కొద్ది గంటల్లో ‘పెద్ది’ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈరోజు రాత్రి నుంచే ‘పెద్ది’ హంగామా షురూ కాబోతోంది. మరి బుచ్చిబాబు తీసుకొన్న నిర్ణయాలు, పడిన కష్టం, చరణ్ పెట్టుకొన్న నమ్మకాలు ఏ మేరకు ఫలించాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.
