‘మేనేజ్‌మెంట్’లో బాబును కొట్టే నాయకుడు మళ్ళీ పుడతాడా?

వ్యవస్థలను నాశనం చేశారు అని చెప్పి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటాడు చంద్రబాబు. కానీ ఆ వ్యవస్థలను మేనేజ్ చేసే విషయంలో మాత్రం చంద్రబాబును కొట్టేటోడు లేడని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. పార్టీ ఫిరాయింపుల గురించి చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 2004 తర్వాత నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డిని, 2014 తర్వాత నుంచీ కెసీఆర్‌ని విమర్శలతో ఉతికి ఆరేశాడు చంద్రబాబు. ఢిల్లీ స్థాయిలో హల్చల్ చేశాడు. అప్పట్లో మీడియా కూడా ఫిరాయింపులను ప్రోత్సహించిన నాయకులను ఓ స్థాయిలో విమర్శించేది. జంతువులతో పోల్చడం అనేది చాలా చిన్న విమర్శ అనే స్థాయిలో చంద్రబాబు మీడియా, హంగామా ఉండేది. తలసాని శ్రీనివాస యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అయితే కెసీఆర్, తలసానిలపైన వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. విమర్శల జడివానను ఎలా ఎదుర్కోవాలో కూడా టీఆర్ఎస్ నేతలకు అర్థం కాలేదు.

తెలంగాణాలో కెసీఆర్ చేసినట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేశాడు. తలసాని చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినందుకు గానూ…ఏ గవర్నర్‌ని అయితే చంద్రబాబు విమర్శలతో ఉతికి ఆరేశాడో అదే గవర్నర్ నరసింహన్ ఇప్పుడు అదే తప్పును రిపీట్ చేశాడు. చంద్రబాబే దగ్గరుండి చేయించాడు. మరి చంద్రబాబు చేసిన తప్పుల గురించి ఎవరైనా మాట్లాడారా? గవర్నర్ తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేశారా? చంద్రబాబు మనవడు దేవాన్ష్‌తో గవర్నర్ ఎలా ఆడుకున్నాడు? దేవాన్ష్‌ని ఎంతమంది సంభ్రమాశ్ఛర్యాలతో చూశారు. దేవాన్ష్ ఎలా వెలిగిపోయాడు లాంటి వార్తలకు మాత్రం చాలా ప్రాధాన్యం దక్కింది. అదీ చంద్రబాబు మేనేజ్ చేసే విధానం. తాను చేసే తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటి. మీడియా, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు…ఇలా వేరే వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న సందర్భాల్లో విమర్శలతో విరుచుకుపడిపోయే వాళ్ళందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే విమర్శనాస్త్రాలను దాచేస్తారు. భజనకు మాత్రం రెడీ అయిపోతారు. సోషల్ మీడియా పుణ్యమాని చంద్రబాబు చేస్తున్న తప్పుల గురించి కాస్తో కూస్తో చర్చలు జరుగుతున్నాయి కానీ లేకపోతే కనీస మాత్రం స్పందించేవాళ్ళు కూడా ఎవరూ ఉండరేమో. అందుకేనేమో…చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరూ కూడా సోషల్ మీడియాను నియంత్రించాలని తెగ తాపత్రయపడుతున్నారు. ప్రజలు మౌనంగా ఉంటే చంద్రబాబుకు అది కూడా సాధ్యమే. ఎందుకంటే దేశంలో ఉన్న ఏ వ్యవస్థనైనా మేనేజ్‌ చేయగల సత్తా, సామర్థ్యం ఉన్న నాయకుడి చేతిలో అధికారం కూడా ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాను నియంత్రించడం పెద్ద విషయమా? ఎటొచ్చీ ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతోంది, అసలుకే మోసం వచ్చే అవకాశముంది అన్న హెచ్చరికలు వెళ్తేనే తప్పులు చేయడానికి భయపడతారు నాయకులు. చంద్రబాబు మేనేజ్‌మెంట్ దెబ్బకు ప్రజలను ఉద్ధరించడం కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకునేవాళ్ళందరూ కూడా బాబు భజనలో మునిగితేలుతున్న నేపథ్యంలో బాబు తప్పులను ఎత్తి చూపుతున్న…ధైర్యంగా స్పందిస్తున్న సోషల్ మీడియా జనాలను మాత్రం కచ్చితంగా అభినందించి తీరాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close