సాయిధ‌ర‌మ్‌ని బాగా వాడేశార్ట‌!

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం న‌క్ష‌త్రం. ఆడియ‌న్స్‌నీ, నిర్మాత‌ల్నీ, హీరోల్నీ మెప్పించాల‌న్నా, త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం క‌ల‌గాల‌న్నా… కృష్ణ‌వంశీ ఈ సినిమాని హిట్ చేయాల్సిందే. అందుకే ఇది వ‌ర‌కు ఏ సినిమాకీ లేనంత ఎఫెక్ట్ నక్ష‌త్రం కోసం పెడుతున్నాడ‌ట‌. ప్ర‌మోష‌న్ ప‌రంగానూ కేర్ తీసుకొంటున్నాడు. ఇప్పుడు బాక్సాఫీసు సూత్రాల‌కు అనుగుణంగా సాయిధ‌ర‌మ్ తేజ్ క్యారెక్ట‌ర్‌ని వాడుకొంటున్నాడ‌ని తెలుస్తోంది. నిజానికి ఈసినిమాలో హీరో సందీప్ కిష‌న్‌. సాయిధ‌ర‌మ్ ది ఓ గెస్ట్ రోల్ మాత్ర‌మే. కేవ‌లం ప‌ది నిమిషాలు క‌నిపించే పాత్ర త‌న‌ది. కానీ… మాస్ లో సాయిధ‌ర‌మ్‌కి మంచి క్రేజ్ ఉంది. దాన్ని వాడుకొనే ప‌నిలో ప‌డ్డాడు కృష్ణ‌వంశీ. అందుకే సాయిధ‌ర‌మ్ క్యారెక్ట‌ర్‌ని పెంచుకొంటూ వెళ్లాడ‌ట‌. దాంతో 10 నిమిషాలు అనుకొన్న‌ది ఇప్పుడు 35 నిమిషాలైంద‌ట‌.

సాయికి రెండు పాట‌లు కూడా ఇచ్చార‌ని స‌మాచారం. దాంతో దాదాపు న‌క్ష‌త్రంలో మ‌రో `హీరో` అయిపోయాడు సాయిధ‌ర‌మ్‌. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొంది. ఆ మిగిలిన ఒక పాట ఐటెమ్ సాంగ్ అని తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ క‌థానాయిక ఈ ఐటెమ్ గీతంలో చిందులు వేయ‌బోతోంద‌ట‌. కృష్ణ‌వంశీ సినిమాలో ప‌ని చేసిన క‌థానాయికే ఇప్పుడు ఐటెమ్ గీతం చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌రి ఆ ఛాన్స్ ఎవరికి ద‌క్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com