అఖిల్ సినిమా…. ప్ర‌యోగాత్మ‌క‌మే

విక్ర‌మ్ కె.కుమార్‌ది ఓ డిఫ‌రెంట్ స్టైల్‌. ఒక‌దానితో మ‌రోటి సంబంధం లేని సినిమాల్ని తీస్తుంటాడు. 13 బి, ఇష్క్‌, మ‌నం, 24…. ఇలా ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌కీ లింకు ఉండ‌దు. ప్ర‌తీ క‌థ‌లోనూ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేస్తాడు. ప్ర‌యోగ‌మే.. కానీ క‌మ‌ర్షియ‌ల్ పంథాలోచెబుతుంటాడు. ఈసారీ అదే ఫార్మెట్‌లో సినిమా తీయ‌బోతున్నాడట‌. అఖిల్ కోసం విక్ర‌మ్ ఓ క‌థ సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం ఈ సినిమాప‌ట్టాలెక్కేసింది కూడా. ఇదో ప్ర‌యోగాత్మ‌క క‌థ అని తెలుస్తోంది. ల‌వ్ స్టోరీని ఓ కొత్త కోణంలో చూపించ‌బోతున్నాడ‌ట‌. నాగ్ కూడా ”శివ ఎలా ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిందో… అఖిల్ సినిమా అలానే పేరు తెచ్చుకొంటుంది” అంటూ.. న‌మ్మ‌కంగా చెబుతున్నాడు.

స్క్రీన్ ప్లే ప‌రంగానూ ఈ సినిమాతో విక్ర‌మ్ ఓ విభిన్న ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా నిడివి కూడా చాలా త‌క్కువ‌ట‌. రెండు గంట‌ల్లోపే క‌థ ముగుస్తుంద‌ని స‌మాచారం. క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు పూర్తి విరుద్ధంగా విక్ర‌మ్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడ‌ని, అందుకే నాగ్ ఈ సినిమాపై అంత భ‌రోసా పెంచుకొన్నాడ‌ని తెలుస్తోంది. అఖిల్ సినిమా పూర్తి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తీశారు.. ఏమైంది? అందుకే ఈసారి… క‌మ‌ర్షియాలిటీని దూరం పెట్టాడ‌న్న‌మాట‌. చూద్దాం.. రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com