భ‌ర్త మ‌ర‌ణించాడ‌ని తెలిసీ….. వార్తా ప‌ఠ‌నం పూర్తిచేసి…

విధి నిర్వ‌హ‌ణ‌లో అప్ర‌మ‌త్త‌త ఎంత అవ‌స‌ర‌మో నిబ‌ద్ధ‌తా అంతే అవ‌స‌రం. కీల‌క‌మైన స‌మ‌యాల‌లో వాటిని ప్ర‌ద‌ర్శించ‌డానికి బ‌హు దొడ్డ గుండెధైర్యం కావాలి. అలాంటి ఉక్కు గుండె ఉన్న మ‌హిళ తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న గుండె నిబ్బ‌రాన్ని గుండెను దిట‌వు చేసుకుని ప్ర‌ద‌ర్శించింది. అనంత‌రం దిక్కులు పిక్క‌టిల్లేలా రోదించింది. ఆమె క‌న‌బ‌రిచిన ధైర్యం టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది.

ఐబిఎన్ 24 చానెల్‌కు చెందిన సుప్రీత్ కౌర్ న్యూస్ రీడ‌ర్‌. య‌ధా ప్ర‌కారం ఆమె బులెటిన్ చ‌దువుతోంది. ఇంత‌లో ఓ బ్రేకింగ్ డ‌స్ట‌ర్ వాహ‌నాన్ని గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొంద‌ని అందులో ముగ్గురు దుర్మ‌ర‌ణం పాల‌య్యార‌నేది దాని సారాంశం. వార్త‌ను చూడ‌గానే ఆమెకు అర్థ‌మైపోయింది. మృత‌దేహం విజువ‌ల్ చూసి, స్థాణువైపోయింది. ఎందుకో తెలుసుకున్న వారి గుండెలు ప‌గిలిపోతాయి. మృతుడు ఆమె భ‌ర్త హ‌ర్ష‌ద్ క‌వాడే. శ‌నివారం ఉద‌యం 10గంట‌ల బులెటిన్ చ‌దువుతుండ‌గా ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వార్తా సిబ్బందికి ఈ విషయం తెలిసి చ‌లించిపోయారు. లైవ్ క‌ట్ చేయ‌డానికి లేదు. కౌరే ఈ వార్త‌ను చ‌ద‌వాలి. మృతుల పేర్లు వారు వెల్ల‌డించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వాహ‌నం, మృత‌దేహం విజువ‌ల్స్ చూసి, ఆమె అర్థం చేసుకుంది. గుండెను రాయి చేసుకుని, వార్త‌ల‌ను చ‌ద‌వ‌డం పూర్తిచేసింది. అప్పటికి ఇంకా ప‌దినిముషాల బులెటిన్ మిగిలుంది. ఇంత వేద‌న‌లోనూ ఆమె విధినిర్వ‌హ‌ణ‌ను మ‌ర‌వ‌లేదు. కెమెరాలు ఆఫ్ చేసిన అనంత‌రం దిక్కులు పిక్క‌టిల్లేలా రోదించింది కౌర్. ఆమెను ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాలేదు. మాన‌వ‌మాత్రులెవ‌రికీ ఇలాంటి ఉదంతాలు ఎదురుకాకూడ‌ద‌నిపించ‌డం లేదు. ఆమె స్థిర‌చిత్తం అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంది. 28 ఏళ్ళ వ‌యసులో ఆమె ప్ర‌ద‌ర్శించిన నిబ్బ‌రం అంద‌ర్నీ అచ్చెరువొందించింది. చ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన ఈ చానెల్‌లో ఆమె తొమ్మిదేళ్ళుగా ప‌నిచేస్తోందనీ, అత్యంత ప్ర‌తిభావంతురాల‌నీ సిబ్బంది తెలిపారు. కింది లింకులో ఆమె త‌న భర్త మ‌ర‌ణ వార్త‌ను చ‌దువుతున్న వీడియో చూడండి… హ్యాట్సాఫ్ సుప్రీత్ కౌర్‌…

ప్రామ్ట‌ర్‌లో చ‌ద‌వాల్సిన వాక్యాలు చూస్తూ కూడా త‌డ‌బ‌డి, ఇబ్బందిప‌డిపోయే యాంక‌ర్లున్న కాలంలో సుప్రీత్ త‌న బాధ‌ను అణుచుకుని వార్త‌లు చ‌ద‌వ‌డం ద్వారా న్యూస్ క్యాస్ట‌ర్ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె చూపిన నిబ‌ద్ధ‌త‌, స్ఫూర్తి అంద‌రికీ ఆచ‌ర‌ణీయం.

Subrahmanyam vs Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close