బాల‌య్య‌తో గొడ‌వ‌లు.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌, నాగార్జున మ‌ధ్య విబేధాలున్నాయ‌ని, ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ద‌ని టాలీవుడ్‌లో ఓ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. బాల‌య్య త‌న వందో సినిమా ప్రారంభోత్స‌వం రోజున ఇండ్ర‌స్ట్రీలోని పెద్ద‌లంద‌రినీ పిలిచాడు. త‌న స‌మ‌కాలికులు వెంక‌టేష్‌, చిరంజీవిని ఆహ్వానించాడు. కానీ..నాగార్జున‌కు ఆహ్వానం అంద‌లేదు. దాంతో బాల‌య్య‌, నాగ్‌ల మ‌ధ్య ఏవో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని రూఢీ అయిపోయింది. అయితే… ఇప్పుడు వీటిపై నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు.

టీఎస్ఆర్ టీవీ 9 అవార్డుల కార్య‌క్రమం ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో సాగుతోంది. వేదిక‌పై నాగార్జున మాట్లాడుతూ బాల‌య్య‌తో ఉన్న రూమ‌ర్ గురించి ప్ర‌స్తావించాడు. ”ఈ వేదిక‌పై ఓ క్లారిటీ ఇవ్వ‌బోతున్నా. నాకూ, బాల‌య్య‌కూ ప‌డ‌ద‌ని, మా మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌ని పిచ్చి పిచ్చి రూమ‌ర్లు వ‌స్తున్నాయి.. అవ‌న్నీ అవాస్త‌వం” అన్నాడు. ఆ స‌మ‌యంలో బాల‌య్య వేదిక‌పైనే ఉన్నాడు. ఇద్ద‌రూ క‌ర‌చాల‌నం చేసుకొని, కాసేపు మాట్లాడుకొన్నారు. ఈ సంఘ‌ట‌న‌… నాగ్ స్పీచ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకొంది. ఇంత స‌డ‌న్‌గా నాగార్జున‌కు ఈ విష‌య‌మై క్లారిటీ ఇవ్వాల‌ని ఎందుకు అనిపించిందో మ‌రి. గ‌తంలో టీఎస్ఆర్ టీవీ 9 అవార్డుల వేడుక‌లోనే నాగ్‌, బాల‌య్య మ‌ధ్య గొడ‌వ మొద‌లైంద‌న్న‌ది రూమ‌ర్ సారాంశం. బ‌హుశా అందుకే.. అదే వేదిక‌పై నాగ్ క్లారిటీ ఇచ్చాడేమో. మొత్తానికి నాగ్‌, బాల‌య్య మ‌ధ్య గొడ‌వ‌ల్లేవ‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. సో.. ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ వీర హ్యాపీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com