ఇదీ రజనీకాంత్ లో గొప్పదనం

సూపర్ స్టార్ రజనీకాంత్ అందరినీ ఆకర్షించే మాగ్నైట్. సినిమా అభిమానులంతా రజనీ అభిమానులే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయనో గొప్ప ట్రెండ్ సెట్టర్. క్రేజ్ లో ఎవరెస్ట్. అన్నిటికి మించి నిగర్వి. ఆయనలోని ఆ సుగుణమే ఆయనికు మరింత అభిమానులను తెచ్చిపెట్టింది. తనపై తనే సెటర్లు వేసుకొనే పెద్ద స్టారు రజనీ. ఆయన ఏ వేడుకలో మాట్లాడినా వున్నది వున్నట్లుగా చెప్పడానికే ఇష్టపడతారు. ఇప్పుడు తను వున్న స్థాయిని ప్రాజెక్ట్ చేసుకోవడం ఆయనకి అస్సల్ ఇష్టం వుండదు. తన బిగినింగ్ ను ఎప్పుడూ మర్చిపోరు రజనీ. తాజాగా ఆయన మరోసారి తన బిగినింగ్ డేస్ ను గుర్తు తెచ్చుకున్నారు. తనపై దర్శకుడు భారతీరాజాకు వున్న అభిప్రాయను మొహమాటం లేకుండా సభా ముఖంగా చెప్పారు.

భారతీరాజా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సినిమా ప్రారంభోత్సవం పాల్గొన్న రజనీ.. ”అసలు రజనీని నటుడిగా ప్రేక్షకులు ఎలా అంగీకరించారో” అనే ప్రశ్న భారతీరాజాలో ఇప్పటికీ వుందని తనదైన శైలిలో నవ్వుతూ చెప్పారు. ”నాకు భారతీరాజా అంటే చాలా ఇష్టం. ఆయనకూ నేనంటే ఇష్టమే. కానీ ఆయన నన్ను నటుడిగా అంగీకరించేవారు కాదు. నా సుధీర్గ సినీ జీవితంలో భారతీరాజా రెండు సార్లు మాత్రమే నా డేట్స్ అడిగారు. ‘పదినారు వయదినిలే’(పదహారేళ్ల వయసు) సినిమా కోసం. రెండోది ఈ కార్యక్రమం కోసమే. బహుసా.. ”రజనీని నటుడిగా ప్రేక్షకులు ఎలా అంగీకరించారో” అనే భావన ఇంకా ఆయనలో వుందేమో”అని నవ్వేశారు రజనీ. ఎలాంటి బేషజం లేకుండా రజనీ నుండి వచ్చిన ఈ మాటలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close