వారు కూలి చేస్తే ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్న‌మాట!

తెరాస ఆవిర్భావ దినోత్సవ సంబ‌రాల‌కు పార్టీ నుంచి సొమ్ము రాద‌న్నారు. ప్ర‌భుత్వం ఇవ్వ‌ద‌న్నారు. జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు పైస‌లు ఉండ‌వ‌న్నారు. నేత‌లూ కార్య‌క‌ర్త‌లూ శ్ర‌మించి, కూలి ప‌నిచేసి స‌భ‌కు రావాల‌న్నారు. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌స్తార‌న్నారు. విన‌డానికి ఈ ఆలోచ‌న ఎంతో బాగుంది అనుకున్నాం. ఒక కొత్త ఒర‌వ‌డికి కేసీఆర్ శ్రీ‌కారం చుడుతున్నార‌ని భావించాం. ఇక‌పై, జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు సొమ్ము వెద‌జ‌ల్ల‌డం తగ్గుతుంద‌ని ఆశించాం. కానీ, వాస్త‌వంలో జ‌రుగుతున్న‌ది ఏంటీ..? కూలి ప‌ని పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న‌దేంటీ..?

ఒక సాధార‌ణ వ్య‌క్తి కూలికి వెళ్తే రోజుకి ఎంతొస్తుంది..? మ‌హా అయితే ఓ మూడువంద‌లు. ఆవిర్భావ స‌భ కోసం తెరాస నేత‌లు కూడా కూలికి వెళ్తున్నారు క‌దా! వీరికి కూడా అంతే కూలి రావాలి క‌దా! కానీ, చిత్రంగా ఎమ్మెల్యులు ఎంపీలు కూలి చేస్తే వేలూ ల‌క్ష‌ల రూపాయలు వ‌స్తున్నాయి. బాన్సువాడ మార్కెట్ యార్డులో మంత్రి పోచారం శ్రీనివాస్ కూలి పని చేస్తే… రూ. 2 ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఒక పూట హ‌మాలీగా ప‌నిచేసినందుకు రైస్ మిల్ల‌ర్ల సంఘం ఇచ్చిన కూలీ అది. మెద‌క్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఏకంగా రూ. 7.5 ల‌క్ష‌లు సంపాదించారు. అది కూడా ఒక్క‌రోజు.. సారీ, ఒక్క‌పూట కూలి ప‌నిచేసి! దేవ‌రకొండ ఎమ్మెల్యే ర‌వీంద్ర కుమార్ ప‌త్తిమిల్లులో ప‌నిచేసిందుకు ల‌భించిన కూలీ.. జ‌స్ట్ ఐదున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు! మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి బియ్యం బ‌స్తాలు మోస్తూ రూ. 10 వేలు సంపాదించారు. ఇలా తెరాస నేత‌లు కూలి ప‌నిచేస్తూ… చాలా క‌ష్ట‌ప‌డి పార్టీ ఆవిర్భావ స‌భ కోసం రూపాయి రూపాయి.. ఛ‌స్‌, వాళ్ల‌కేం ఖ‌ర్మ‌.. వేలూ ల‌క్ష‌లూ పోగేస్తున్నారు.

అంతిమంగా జ‌రుగుతున్న‌ది ఏంటీ..? పార్టీ ఆవిర్భావ స‌భ పేరుతో భారీ ఎత్తున వ‌సూళ్లు చేస్తున్నారు. తెరాస నేత‌లు కూలి ప‌ని చేస్తారంటే, సాధార‌ణ కూలీలానే వేత‌నం తీసుకుంటార‌ని… అలా వ‌చ్చిన ప్ర‌తీ రూపాయినీ స‌భ కోసం ఖ‌ర్చు చేసి ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తార‌ని అనుకున్నాం. కానీ, ఇక్క‌డ జ‌రుగుతున్న‌ది మ‌ళ్లీ అదే పాత తంతు. ఈ మాత్రం దానికి ఏదో చెమ‌టోడ్చి సంపాదించేస్తున్నాం అనే బిల్డ‌ప్పులు ఎందుకు..? ఈ నాయ‌కులు చేస్తున్న కాయ‌క‌ష్టం మీడియా స్టిల్స్ కు, ప్ర‌చారానికీ త‌ప్ప వేరే ఉప‌యోగం ఉందా..? పోనీ, వీరు సంపాదించిన ల‌క్ష‌లూ వేలతో పేద‌ల‌కి ఉప‌యోగక‌ర‌మైన ప‌ని చేస్తున్నారా..? పార్టీ ఉత్స‌వాల కోసం ఇంత హంగామా అవ‌స‌ర‌మా..? నాయ‌కులు కూలి ప‌నిచేయుట అనే ఈ మ‌హ‌త్కార్యం వ‌ల్ల ప్ర‌చారార్భాటం త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే అంశం ఏమైనా ఉందా చెప్పండీ..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close