క‌ట్ట‌ప్ప సారీ చెప్పాడు.. లైన్ క్లియ‌ర్ అయిపోయిన‌ట్టేనా?

కావేరీ జ‌లాల వివాదంలో త‌ల దూర్చి క‌న్న‌డీగుల మ‌న‌సు నొప్పించాడు క‌ట్ట‌ప్ప సత్య‌రాజ్‌. ఆయ‌న‌పై కోసం బాహుబ‌లి 2పై చూపించ‌డం మొద‌లెట్టారు క‌ర్నాట‌క వాసులు. బాహుబ‌లి 2ని త‌మ రాష్ట్రంలో విడుద‌ల కానివ్వం అంటూ ప‌ట్టుప‌ట్టారు. బాహుబ‌లి 2కీ, కావేరీ జాలాల‌కూ సంబంధం ఏమిటి?? ద‌య‌చేసి బాహుబ‌లి 2 విడుద‌ల‌కు అడ్డుతగ‌లొద్దు అంటూ స్వ‌యంగా రాజ‌మౌళి వేడుకొన్న సంగ‌తి తెలిసిందే. అయినా… క‌న్న‌డీగుల కోపం చ‌ల్లార‌లేదు. దాంతో ఇప్పుడు స‌త్య‌రాజే స్వ‌యంగా రంగంలోకి దిగాడు. క‌ర్నాట‌క ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు. బాహుబ‌లి 2ని అడ్డుకోవొద్ద‌ని వేడుకొన్నాడు. మ‌రి ఇప్పుడైనా బాహుబ‌లి 2 కి లైన్ క్లియ‌ర్ అవుతుందేమో చూడాలి.

నిజానికి కావేరీ జాల‌ల‌పై న‌టీన‌టులు, రాజ‌కీయ నాయ‌కులు పెద‌వి విప్ప‌డానికి జంకు తున్నారు. ఏం మాట్లాడితే, ఏం అవుతుందో అనేది వాళ్ల భ‌యం. అయితే స‌త్య‌రాజ్ మాత్రం నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. అయితే ఆ ఎఫెక్ట్ బాహుబ‌లి 2పై ప‌డుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. ఈ సినిమాని క‌ర్నాట‌క‌లో దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పుడు బాహుబ‌లి అక్క‌డ విడుద‌ల కాక‌పోతే.. బ‌య్య‌ర్లు నిండా మున‌గాల్సిందే. అందుకే రాజ‌మౌళి స్వ‌యంగా రంగంలోకి దిగాల్సివచ్చింది. క‌ట్ట‌ప్ప‌తో క్ష‌మాప‌ణ‌లు చెప్పించిందీ రాజ‌మౌళినే అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close