గ‌న్న‌వ‌రం ఇక అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం

గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి అంత‌ర్జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీక‌రించింది. బుధ‌వారం నిర్వ‌హించిన కేంద్ర క్యాబినెట్ స‌మావేశంలో ఈ అంశాన్ని అంగీక‌రించింది. ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న అనంత‌రం న‌వ్యాంధ్ర‌కు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఏర్పాటు త‌ప్ప‌ని స‌రైంది. ఇప్ప‌టికే గ‌న్న‌వ‌రంలో ఉన్న విమానాశ్ర‌యాన్ని అవ‌స‌రాల మేర‌కు విస్త‌రించారు. ఇప్పుడు కేంద్రం అనుమ‌తి రావ‌డంతో విమానాశ్ర‌యానికి అంత‌ర్జాతీయ హోదా ల‌భించ‌నుంది.

రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం సైనిక స్థావ‌రంగా ఉప‌యోగ‌ప‌డింది. 2003 నుంచి ఎయిర్ డెక్క‌న్ సంస్థ విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ న‌డుమ రోజువారీ విమానాల‌ను న‌డ‌ప‌డం ప్రారంభించింది. 537 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్ర‌యంలో ప్ర‌స్తుతం 2286మీట‌ర్ల ర‌న్‌వే ఉంది. 14 నెల‌ల్లో 135 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి, కొత్త టెర్మిన‌ల్‌ను నిర్మించారు. 2017 జ‌న‌వ‌రి 12న ప్రారంభ‌మైంది. ఇప్పుడు అంత‌ర్జాతీయ టెర్మిన‌ల్‌ను నిర్మించాల్సుంది. న‌వ్యాంధ్ర‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగానూ, రాజ‌ధానికి మ‌కుటంగానూ భాసిల్లే గ‌న్న‌వ‌రం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ఎన్టీరామారావు పేరు పెడ‌తార‌న‌డంలో ఎటువంటి సందేహ‌మూ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close