క‌లివిడిగా తెలివిడిగా.. కేసీఆర్ నిర్ణ‌యాలు

మిర్చి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌పై కేంద్రం ప్ర‌క‌ట‌న మిలీనియం జోక్ అంటూ తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్య ఆ రాష్ట్ర గ‌డ‌స‌రి వైఖ‌రిని వెల్ల‌డిస్తోంది. మిర్చి పంట‌ను 33వేల ట‌న్నులు క్వింటాలు 5 వేల‌కు కొనాల‌ని చేసిన ప్ర‌క‌ట‌న రైతులకు శ‌ఠ‌గోపం పెట్టేలా ఉంద‌న్నారు. మార్కెట్‌కు 7ల‌క్ష‌ల ట‌న్నుల మిర్చి వ‌చ్చిందనీ, కేంద్ర ప్ర‌క‌ట‌న వ‌ల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్ర‌యోజ‌న‌మూ లేద‌నేది ఆయ‌న వాద‌న‌. మిర్చి పంట మ‌ద్ద‌తు ధ‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిథిలోకి రాద‌ని ఆయ‌న అంటున్నారు. వ‌రి ధాన్యం రాష్ట్ర ప‌రిథిలోనిదేన‌నీ, తాము ఇవ్వాల్సినంత ఇచ్చి, వ‌రి, కందులు కొనుగోలు చేశామ‌ని తెలిపారు. మ‌ధ్య ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు మిర్చి పంట‌ను కొన‌డం లేదే అని కూడా హ‌రీశ్ అన‌డం కేంద్రాన్ని స‌వాలు చేయ‌డ‌మే. మిర్చి స‌మ‌స్య‌ను అర్థం చేసుకోవ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌నేది ఆయ‌న అభిప్రాయం. కోల్డ్ స్టోరేజీల‌కోసం పెట్టిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం ప‌ట్టించుకోలేద‌నీ, ఈ అంశంపై మ‌రోసారి లేఖ రాస్తున్నామ‌నీ హ‌రీశ్ తెలిపారు. పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌లు నిర్ణ‌యించాల్సిన బాధ్య‌త కేంద్రానిదేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారాయ‌న‌.

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌న్న త‌ర‌వాత ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో వ్య‌వ‌హారాలు సాగాలి. పాల‌న‌లో ఈ రెండింటికీ మ‌ధ్య పొర‌పొచ్చాల వ‌ల్ల న‌ష్ట‌పోయేది ప్ర‌జ‌లు త‌ప్ప నాయ‌కులు కాద‌న్న విష‌యాన్ని గుర్తెరిగి మెల‌గాలి. అయినా స‌రే.. మొద‌టి నుంచి కేసీఆర్ ప్ర‌భుత్వం ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రిని అనుస‌రిస్తున్న‌ట్లే క‌నిపిస్తూ.. త‌న ప‌నుల‌ను చ‌క్క‌బెట్టేసుకుంటోంది. డీమానిటైజేష‌న్ అంశానికి మ‌ద్ద‌తు ప‌లుకుదామంటూ చెప్పి, కేసీఆర్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య చ‌కితుల్ని చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌యోజ‌నాల‌నూ పొందారు. ప‌క్క రాష్ట్రంలో చంద్ర‌బాబుసైతం డీమానిటైజేష‌న్‌పై మొద‌ట అసంతృప్తిని వెళ్ళ‌గ‌క్కిన సంగ‌తి మ‌నకి తెలుసు. వ్యతిరేకిస్తున్న‌ట్లుండ‌డం..అంత‌ర్లీనంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోవ‌డం కేసీఆర్ మొద‌టి నుంచీ అనుస‌రిస్తున్న వైఖ‌రి. తాజాగా మిర్చిపై హ‌రీశ్ వ్యాఖ్య‌లు ఎటువంటి ప్ర‌యోజ‌నాన్ని చేకూరుస్తాయో వేచి చూడాల్సిందే. మ‌రో కోణంలో చూస్తే..మిర్చి సృష్టించిన వివాదాల గొట్రునుంచి త‌ప్పించుకోవ‌డం దీని ముఖ్య ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. కేసీఆర్ ఏం చేసినా తెలివిడిగా.. క‌లివిడిగా చేస్తారు. హ‌రీశ్ మీడియా స‌మావేశం అవ్వ‌గానే రెండు కీల‌క నిర్ణ‌యాల‌నూ తీసుకున్నారు కేసీఆర్‌. మొద‌టిది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీక‌రించి ఢిల్లీ నుంచి వ‌స్తున్న ద‌ర్శ‌కుడు కాశీనాధుని విశ్వ‌నాథ్‌కు శంషాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో స్వాగ‌తం ప‌ల‌కాల‌ని మంత్రి త‌ల‌సానిని ఆదేశించారు. రెండోది.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏకు మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌నీ తెరాస పార్ల‌మెంట‌రీ పార్టీ నేత జితేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. కేసీఆర్ రాజ‌కీయ వైదుష్యానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ ఏం కావాలి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close