అమెరికా యాత్రపై చంద్రబాబుకే తెలియని పొగడ్తలు

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అమెరికాలో పర్యటనకు వెళ్లారు. ఈ దీర్థ పర్యటనలో ఆయన 100 కంపెనీల సిఇవోలను కలుసుకుంటారని పెద్ద ప్రచారం జరిగింది. అధికారికంగా విడుదల చేసిన నోట్‌ చూస్తే మే 8న ఆయనకు క్యాలిఫోర్నియాలో ‘మోస్ట్‌ ట్రాన్సర్మర్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌'( అత్యంత పరివర్తనాశీల ముఖ్యమంత్రి) అవార్డు ఇస్తారట. ఇస్తున్నది భారత అమెరికా వాణిజ్య మండలి. ఈ సందర్భంలోనే 150 మంది ముఖ్యమైన వ్యాపార సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చంద్రబాబు వారితో సంప్రదింపులు జరుపుతారని అధికారిక ప్రకటన చెబుతున్నది. అంతేగాని గతంలో చెప్పిన 100 మంది సిఇవోల లెక్క లేదు. ఇక పోతే ముఖ్యమంత్రికి వచ్చిన అవార్డును కూడా మీడియాలో ఒక భాగం ఎలా ఎక్కువ చేయాలని ప్రయత్నిస్తుందో చూస్తే తమాషాగా వుంది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల సమన్వయకర్తగా మిమ్మలను ఆహ్వానించారు కదా అని ఒక విలేకరి అడిగారు. ముఖ్యమంత్రి అది నిజం కాదని ఖండించేబదులు నాకు తెలియని విషయం మీకు తెలిసిందే అని ఆశ్చర్యంగా వాకబు చేశారు. తనకు వ్యాపార మండలి అవార్డు ఇస్తున్నదని తర్వాత వివరించారు. గతంలో మంత్రి లోకేశ్‌( ఇంకా మంత్రి కాకముందు) అమెరికా పర్యటన జరిపినప్పుడు అద్యక్షుడు ఒబామా మెచ్చుకున్నారని ఒక పెద్ద ప్రచారం నడిచింది. దానిపై వివాదమూ సాగింది. 2015లో చంద్రబాబుకు చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చినపుడు కూడా ప్రతిపక్ష వైసీపీనుంచి దానిపై విమర్శలు వచ్చాయి. అప్పుడు కూడా ఆయనకు ఆర్థిక సంస్కరణలు బాగా అమలు జరుపుతున్నందుకే డాక్టరేట్‌ ఇస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. వాస్తవానికి మొదటి సారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబును ప్రపంచ స్వప్న మంత్రివర్గం(డ్రీమ్‌ క్యాబినెట్‌)లో సభ్యుడుగా ప్రకటించిన సంగతి గుర్తుండే వుంటుంది.విదేశీ సంస్థలు ఎవరిపైనా ఇంతగా పొగుడుతున్నాయంటే వారి చర్యలు వాటికి బాగా లాభదాయకంగా వున్నాయని అర్థం చేసుకోకతప్పదు. ఈ సారి పర్యటనలో చంద్రబాబు బృందం ఇలియనాయిస్‌లో ఐటి రంగాన్ని, క్యాలిఫోర్నియాలో స్మార్ట్‌ ప్రాక్టీసులను, లోవా రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనా రంగాలను పరిశీలిస్తారని సమాచారం. ఈ పర్యటనలో లోకేశ్‌ కూడా ఆయనతో వెళతారని మొదట అధికారికంగా ప్రకటించి తర్వాత అధికారికంగానే సవరించారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు వెంటవెళ్లారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close