బాలయ్య సినిమా… రూ.9 కోట్లు

నంద‌మూరి బాల‌కృష్ణ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈనెల 11నుంచి పోర్చుగ‌ల్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాదాపు 40 రోజుల పాటు అక్క‌డ భారీ యాక్ష‌న్ దృశ్యాల‌తో పాటు, పాట‌ల్నీ తెర‌కెక్కిస్తారు. ఈలోగా.. ఇక్క‌డ ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ మొద‌లైపోయింది. తొట్టతొలుత శాటిలైట్‌తో బోణీ కొట్టేశారు. జెమినీ సంస్థ‌కు ఈ చిత్రాన్ని రూ.9 కోట్ల‌కు అమ్మేసింది చిత్ర‌బృందం. ఇది వ‌ర‌కు బాల‌య్య చిత్రాల‌న్నీ రూ.6 నుంచి రూ.8 కోట్ల వ‌ర‌కూ ప‌లికేవి. సింహా, లెజెండ్ చిత్రాల‌కు శాటిలైట్‌లో ఇప్ప‌టికీ మంచి రేటింగులు వ‌స్తున్నాయి. దాంతో గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సినిమాకి భారీ ఎత్తున కొనేసింది మాటీవీ. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు సార్లు ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేసినా.. రేటింగులు అంతంత మాత్రంగా వ‌చ్చాయి. అయినా స‌రే.. పూరి సినిమాకి రూ.9 కోట్లు ప‌ల‌క‌డం విశేష‌మే. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం ఓ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తోంది. పోర్చుగ‌ల్ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర‌వాత‌.. టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి స‌మాయాత్తం అవుతోంది యూనిట్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close