దావూద్ కు చెక్ !

మాఫియా డాన్, బొంబాయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం కు చెక్ పెట్టడానికి భారత్ స్కెచ్ వేసిందనే ఊహాగానాలు వినవస్తున్నాయి. దీనిపై పాక్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. కోవర్ట్ ద్వారా దావూద్ ను అంతం చేయడానికి భారత్ ఇప్పటికే ప్రయత్నాలను మొదలు పెట్టిందన్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి.nమోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ను పట్టుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమని, సామ దాన భేద దండోపాయాల్నీ ప్రయోగిస్తామని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. కోవర్ట్ ఆపరేషన్ కూడా చేయవచ్చు, అయితే అది ఊరంగా టముకేసి చెప్పేది కాదన్నారు.

పాకిస్తాన్ లోని కరాచీలో నివసిస్తున్న దావూద్ ను మట్టుబెట్టడానికి భారత్ కోవర్టును రంగంలోకి దింపిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కోవర్టు వల్ల కాకపోతే లాడెన్ అమెరికా అంతం చేసిన విధంగా స్పెషల్ ఆపరేషన్ చేయవచ్చనే మరో కథనం వ్యాప్తిలో ఉంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహాన్ని కూడా భారత్ అమలు చేయవచ్చంటున్నారు. స్మగ్లర్ గ్యాంగుల మధ్య విభేదాలను ఆసరాగా చేసుకుని డాన్ ను ఖతం చేయవచ్చన్నది పాక్ మీడియాలో వస్తున్న కథనం. కరాచీలోనూ అనేక స్మగ్లింగ్ ముఠాలున్నాయి. సాధారణంగా ఈ గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటుంది. అలా, దావూద్ తో విభేదాలున్న స్మగ్లర్ ద్వారా స్పెషల్ ఆపరేషన్ గురించి భారత్ ఆలోచించ వచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే, కోవర్ట్ కోణంలోనే ఎక్కువ మీడియా సంస్థలు కథనాలు, ఊహాగానాలు ప్రసారం చేస్తున్నాయి. బాలీవుడ్ తాజా సినిమా ఫాంటంలోని సీన్ ను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అందులో హీరో సైఫ్ అలీ ఖాన్ పాకిస్తాన్ కు వెళ్లి, ముంబై దాడుల సూత్రధారులను అంతం చేస్తాడు.

మరోవైపు, యు ఎ ఇలోని దావూద్ ఆస్తులను జప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. గతనెలలో ప్రధాని మోడీ అమెరికా వెళ్లినప్పుడు ఈ మేరకు అక్కడి ప్రభుత్వానికి సూచన చేశారు. ఆ ప్రకరాం దుబాయి సహా ఆ దేశంలోని అన్ని నగరాల్లో దావూద్ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. వాటన్నింటినీ జప్తు చేసి భారత్ తో స్నేహ బంధం బలోపేతం చేసుకోవాలని యు ఎ ఇ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే దావూద్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసినట్టవుతుంది. మొత్తం మీద, దావూద్ కు భారత్ చెక్ పెట్టిందనేది హాట్ న్యూస్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close