ల‌వ‌కుశ‌.. మూడు లుక్కులూ ఒకేసారి

స్టార్ హీరో పుట్టిన రోజు అంటే.. ఆ హంగామానే వేరుగా ఉంటుంది. స‌ద‌రు హీరో సినిమా రిలీజ్ అయినంత సంబ‌రాలు చేసుకొంటారు అభిమానులు. హీరోలూ అంతే. ఫ్యాన్స్‌ని ఏదోలా సంతృప్తి ప‌ర‌చాల‌ని చూస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ కూడా అదే ప‌నిలో ఉన్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కి ఓ గిఫ్ట్ ఇవ్వాల‌నుకొంటున్నాడు ఎన్టీఆర్‌. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘జై ల‌వ‌కుశ‌’. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని ఈనెల 19న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈమూడు గెట‌ప్పుల‌నీ ఒకేసారి రివీల్ చేయ‌బోతున్నార్ట‌. ఒక్కో గెట‌ప్‌నీ ఒక్కోసారి చూపించాల‌ని చిత్ర‌బృందం భావించింది. తెర‌పై బొమ్మ ప‌డేంత వ‌ర‌కూ స‌స్పెన్స్ కొన‌సాగిద్దాం అని కూడా అనుకొంది. కాకపోతే గెట‌ప్‌ల‌ను దాచి పెడితే. ఫ్యాన్స్ మ‌రీ ఎక్కువ ఊహించేసుకొంటారేమో అని ఆలోచించింద‌ట‌. అందుకే.. మూడు గెట‌ప్పులూ ఒకేసారి రివీల్ చేస్తే బెట‌ర్ అని ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండు మూడు పోస్ట‌ర్ల‌ని ద‌ర్శ‌కుడు బాబి డిజైన్ చేశాడ‌ని, అందులో ఒక‌దాన్ని ఎన్టీఆర్ ఫిక్స్ చేయాల్సివుంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close