అక్ష‌రాభ్యాసంలో కొత్త సంప్ర‌దాయం

అక్ష‌రాభ్యాసం చేయించిన‌ప్పుడు చిన్న పిల్ల‌ల‌తో ఓం న‌మఃశివాయ అని రాయిస్తారు. దీనికి కార‌ణం శివ‌పంచాక్ష‌రిని మొద‌ట రాయిస్తే స‌ర్వం శుభ‌క‌ర‌మ‌ని భావించ‌డం. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ విష‌యంలో కొత్త సంప్ర‌దాయాన్ని సృష్టించారు. త‌న మ‌న‌వ‌డు దేవాంశ్ అక్ష‌రాభ్యాసాన్ని వైభ‌వోపేతంగా నిర్వ‌హింప‌జేసిన ఆయ‌న ఆ త‌దుప‌రి ఈ అంశాన్ని వెల్ల‌డించారు. త‌న మ‌నుమ‌డితో అమ్మ‌, అమరావ‌తి, ఆదాయం, ఆరోగ్యం, ఆనందం అనే ప‌దాల‌ను రాయింప‌జేశారు ముఖ్య‌మంత్రి. ఆ ర‌కంగా అమ‌రావ‌తిప‌ట్ల త‌న‌కెంత అనుర‌క్తి ఉన్న‌దీ చాటుకున్నారు. మ‌నుమ‌డి అన్న‌ప్రాశ‌న కూడా తిరుమ‌ల‌లోనే నిర్వ‌హించాన‌నీ, కొత్త ప‌దాలు రాయించి, స‌రికొత్త సంప్ర‌దాయాన్ని సృష్టింప‌జేశాన‌నీ తెలిపారు. మ‌నుమ‌డంటే ఎవ‌రికి అనుర‌క్తి ఉండ‌దు చెప్పండి. అ అంటే అమ్మ అని రాయించారు ఓకే. ఆ అంటే ఆవు అని క‌దా రాయించాలి. ఆదాయం, ఆరోగ్యం, ఆనంద‌మంటే ఎంతో ఇష్ట‌మున్నా ఆవును ఎందుకు విస్మ‌రించారు. ఆవు పాల‌తో ఆయ‌న రాయించిన మూడు ప‌దాల లాభాల‌ను పొందారు కాబ‌ట్టి, రాయ‌న‌వ‌సరం లేద‌నుకున్నారా! ఎంతైనా చంద్ర‌బాబు తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది చాలా చాక‌చ‌క్యంగా చెప్ప‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నారు. దేవాంశ్ అక్ష‌రాభ్యాసం సందర్భంగా ఆయ‌న ఎంతో మురిసిపోయారు. మ‌న‌వ‌ణ్ణి చంక దింప‌లేదంటే న‌మ్మండి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

వియ్యంకుడి తరఫున విక్టరీ వెంకటేష్ ప్రచారం..!!

లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ సినీ స్టార్లు కూడా ప్రచార పర్వంలోకి దూకుతున్నారు. తమ బంధువులను ఎన్నికల్లో గెట్టేక్కించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా టాలీవుడ్...

బీఆర్ఎస్ ను పతనావస్తకు చేర్చుతున్న కేసీఆర్..!?

బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close