క్విడ్ ప్రోకో ఆరోప‌ణ‌ల్లోకి మోడీని లాగుతున్న‌ట్టా..?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఇంకా రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేపుతూనే ఉంది. త‌న‌పై ఉన్న కేసుల విముక్తి కోస‌మే జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లార‌నీ, ప్ర‌ధాన‌మంత్రి కాళ్లు ప‌ట్టుకుని కేసులు కొట్టించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే వెళ్లుంటే… ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌ధాని ద‌గ్గ‌ర ఎందుకు ప్ర‌స్థావ‌న తేలేదంటూ సీఎం చంద్ర‌బాబు కూడా విమ‌ర్శించారు. అయితే, ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేసిన తాజా విమ‌ర్శ‌లు, మోడీకి కూడా త‌గిలేట్టుగా ఉన్నాయ‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ ను విమ‌ర్శించే క్ర‌మంలో ప్ర‌ధాని మోడీపై కూడా టీడీపీ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్టుగా ఉంది! ఓ మీడియా సంస్థ ఇచ్చిన క‌థ‌నం ప్ర‌కారం.. రాష్ట్రప‌తి ఎన్నిక కోసం కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారుకు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇస్తున్నార‌నీ, దీనికి ప్ర‌తిఫ‌లంగా త‌న‌పై ఉన్న కేసుల నుంచి బ‌య‌ప‌డాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నీ, ఇది క్విడ్ ప్రోకో అవుతుంది క‌దా అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ట్టు క‌థ‌నం. త‌న‌పై ఉన్న అవినీతి ఆరోప‌ణ‌లు, ఈడీ కేసుల నుంచి విముక్తి క‌ల్పించుకోవ‌డం కోస‌మే కేంద్రంతో జ‌గ‌న్ ఈ విధంగా డీల్ చేస్తున్నార‌ని అన్నార‌ట‌. ప్ర‌త్యేక హోదా విష‌యంలో తాను నాడు రాజీప‌డింది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకునే అనీ.. హోదాకి స‌మాన‌మైన ప్యాకేజీని సాధించుకున్నామ‌ని మ‌ర‌చిపోకూడ‌ద‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

కేసుల నుంచి విముక్తి పొందేందుకే మోడీ కాళ్లు జ‌గ‌న్ ప‌ట్టుకున్నార‌ని విమ‌ర్శించ‌డం వ‌ర‌కూ ఓకే. అది వైకాపాని విమ‌ర్శించిన‌ట్టు అవుతుంది. కానీ, క్విడ్ ప్రోకో కి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ విమ‌ర్శించ‌డ‌మే వేరే అర్థాల‌కు తావిస్తోంది. క్విడ్ ప్రోకో అంటే రెండు వైపులా లాభం ఉండాలి క‌దా. అంటే, రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఎన్డీయేకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా కేసుల నుంచి విముక్తి పొంద‌డం జ‌గ‌న్ ల‌బ్ధి అని చంద్ర‌బాబు విమ‌ర్శించిన‌ట్టు అర్థం చేసుకోవాలి. ఇక‌, భాజ‌పా సైడ్ నుంచి రాజ‌కీయ ల‌బ్ధి ఏంటంటే… జ‌గ‌న్ కేసుల‌ను అడ్డం పెట్టుకుని రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు పొందుతున్న‌ట్టు ఆరోపిస్తున్న‌ట్టుగానే అనిపిస్తోంది క‌దా! క్విడ్ ప్రోకో అని ఆరోపిస్తే ఇలాంటి అర్థ‌మే ధ్వ‌నిస్తుంది క‌దా.

నిజానికి, జ‌గ‌న్ కు ప్ర‌ధాని అపాయింట్మెంట్ ఇవ్వ‌డ‌మే టీడీపీ నేత‌ల‌కు న‌చ్చ‌లేద‌న్న‌ది వాస్త‌వం. ఆర్థిక నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తితో ప్ర‌ధాని భేటీ ఏంటీ అంటూ టీడీపీ నేత‌లు త‌ప్పుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీనికి తోడు జ‌గ‌న్ భేటీ విష‌యంలో టీడీసీ స్పంద‌నే స‌రిగా లేద‌న్న‌ట్టుగా భాజపా నేత‌లు కూడా విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటున్నారు! మొత్తానికి, ప్ర‌ధానితో జ‌గ‌న్ భేటీ కావ‌డంపై టీడీపీ ఇంకా లోలోపల ర‌గులుతోంద‌ని మాత్రం అర్థ‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close