బ‌న్నీ… నువ్వు సూప‌రోయ్‌!

టాలీవుడ్‌లో ఉన్న ది బెస్ట్ డాన్స‌ర్ల‌లో అల్లు అర్జున్ ఒక‌డు. ఆ మాట‌కొస్తే… ఆల్ ఇండియాలోనూ బ‌న్నీ డాన్సు విష‌యంలో ది గ్రేటే! చిన్న చిన్న స్టెప్పుల్ని సైతం చాలా ఈజ్ తో వేస్తాడు. బ‌న్నీ టాలెంట్ మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. జూన్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈలోగా ప్ర‌మోష‌న్లు కూడా మొద‌లెట్టేసింది చిత్ర‌బృందం. ఆమ‌ధ్య డీజే అంటూ సాగే తొలి పాట‌ని విడుద‌ల చేసిన టీమ్‌.. ఇప్పుడు రెండో పాట‌నీ వ‌దిలేసింది. గుడిలో బ‌డిలో మ‌డిలో అంటూ సాగిన ఈ పాట‌.. వీడియో రూపంలో అప్‌లోడ్ చేసింది చిత్ర‌బృందం. ట్యూన్ ఓకే అనిపించేలా ఉంది గానీ, అందులో బ‌న్నీ స్టెప్పులు, స్టెప్పుల్లో అత‌ని గ్రేస్‌, కాస్ట్యూమ్స్ ఇవ‌న్నీ అదిరిపోయాయి. బ‌న్నీ సింపుల్ స్టెప్పులు వేయ‌డానికే… డీఎస్‌పీ ఇలాంటి ట్యూన్ సెట్ చేశాడా… అనిపిస్తోంది. పూజా హెగ్డే ఈ పాట‌లో మ‌రింత గ్లామ‌రెస్ గా క‌నిపిస్తోంది. డీజే నుంచి మ‌రో ట్రీట్ వ‌చ్చేంత వ‌ర‌కూ ఈ పాట దుమ్ము రేప‌డం ఖాయం. పాట‌ల్లో ప‌దాలు కూడా కాస్త గ‌మ్మ‌త్తుగానే ఉన్నాయి.. హీరో బ్రాహ్మ‌ణ కుర్రాడు క‌దా, అందుకే అగ్ర‌హారం, మ‌డి, తాంబూలం, త‌మ‌ల‌పాకు అనే పదాల‌కు చోటిచ్చారు. మొత్తానికి ఈ పాట‌తో డీజేపై న‌మ్మ‌కం మ‌రింత పెరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close