అనుభవం….ఎపికి అక్కరకు వస్తోందా బాబూ?

దేశంలోనే అత్యంత అనుభవజ్ఙడినైన నాయకుడిని నేను, ప్రపంచానికే పాఠాలు చెప్పాను లాంటి మాటలు చంద్రబాబు నోటి వెంట తరచుగా వస్తూ ఉంటాయి. నిజంగా కూడా ఇప్పుడు దేశంలో ఉన్న నాయకుల్లో యాక్టివ్‌గా ఉన్నవాళ్ళలో చంద్రబాబు అత్యంత అనుభవజ్ఙుడు అని అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఆ అనుభవం కొత్త రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే గెలిపించారు. కానీ చంద్రబాబు అనుభవం ఎపికి ఉపయోగపడుతోందా? విభజన సమయంలో ఒక స్టాండ్ తీసుకోలేక విఫల రాజకీయాన్ని నడిపించిన చంద్రబాబు తనకు ప్రత్యర్థులైన కాంగ్రెస్, వైకాపాలను దోషులుగా నిలబెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. విభజనలో కాంగ్రెస్‌తో సమాన పాత్రను పోషించిన బిజెపిని నిర్దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే టిడిపిని కూడా. ఎలా అయితేనేం ఎన్నికల్లో గెలవడం వరకూ చంద్రబాబు అనుభవం టిడిపి, బిజెపిలకు అద్భుతంగా పనికొచ్చింది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచీ మాత్రం చంద్రబాబు అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఎంతలా ఉపయోగపడుతోంది అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. పెట్టుబడుల కోసం దేశదేశాలు తిరగడం, రాజధాని రైతుల నిరసనలు కనిపించకుండా భూములు సమీకరించడం, వైకాపాను, జగన్‌ని అణచడంలో మాత్రం చంద్రబాబు వంద శాతం సక్సెస్ అయ్యాడు. కానీ తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ, ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇక అత్యంత అనుభవజ్ఙుడిని…ఎవ్వరికీ భయపడను అని కూడా చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటాడు కానీ మోడీ దగ్గర తగ్గడానికి రాష్ట్ర అవసరాలే కారణం అనుకుందాం. మరి కెసీఆర్ దగ్గర ఎందుకు తగ్గుతున్నట్టు? రాష్ట్ర విభజనను పాపంగా అభివర్ణిస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలను కెసీఆర్‌తో సహా టీఆర్ఎస్ నేతలందరూ ఖండించారు. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కానీ చంద్రబాబుతో సహా టిడిపి నెతలెవ్వరూ కూడా టీఆర్ఎస్ నేతల విమర్శలకు సమాధానం ఇవ్వలేదు. పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. కొన్ని గంటల్లోనే కెసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తా అని ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడేమైనట్టు? ఎందుకు కెసీఆర్ దగ్గర కూడా తగ్గాల్సి వస్తోంది? రాజకీయ వ్యూహాలు, మీడియా మేనేజ్‌మెంట్ విషయంలో చంద్రబాబు అనుభవం ప్రతి రోజూ కనిపిస్తూనే ఉంది. కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు అన్న మాట వాస్తవం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close