వెంకీ ముచ్చ‌ట ఇలా తీరింది

ఆ మధ్య విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ”త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇదేంటో త్వరలోనే తెలుస్తుంది” అని ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడా బిగ్ సర్ ప్రైజ్ ఏంటో తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నారు. అవును.. నిజమే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు వెంకటేష్. ఆయన షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సారధి స్టూడియో జరుగుతుంది. ఈ రోజు సెట్స్ లోకి వచ్చిన వెంకటేష్ పై కొన్ని సీన్లు తీశారు త్రివిక్రమ్. ఇది కాస్త గోప్యంగా వుంచాలని భావించారు. కానీ స్టూడియో నుంచి ఈ వార్త బయటికి వచ్చేసింది.

నిజంగా ఇది బిగ్ సర్ ప్రైజ్ నే. పవన్ కళ్యాణ్ – వెంకీ కలసి గోపాల గోపాల చేశారు. ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించబోతున్నారన్నమాట. అన్నట్టు.. ఇక్కడ త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబో గురించి చెప్పుకోవాలి. వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ ట్రైనర్ సినిమాలు అందించిన రైటర్ త్రివిక్రమ్. వెంకీ టైమింగ్ అంటే త్రివిక్రమ్ కు చాలా ఇష్టం. వెంకీ – త్రివిక్ర‌మ్ కాంబో కోసం సినీ జ‌నాలు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. వెంకీ ఈమ‌ధ్య దూకుడు త‌గ్గించ‌డం, త్రివిక్ర‌మ్ పెద్ద స్టార్ల‌తో క‌మిట్ అవ్వ‌డంతో.. ఆ కాంబో ప‌క్క‌కు వెళ్లిపోయింది. ఈ రూపంలో వెంకీ త‌న ముచ్చ‌ట తీర్చుకొంటున్నారేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close