శ‌మంత‌క‌మ‌ణి ట్రైల‌ర్‌: ఓ కారు.. పార్టీ… 5 కోట్లు

భ‌లే మంచి రోజు సినిమాతో ఆక‌ట్టుకొన్నాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఇప్పుడు న‌లుగురు హీరోల‌తో ‘శ‌మంత‌క‌మ‌ణి’ తీస్తున్నాడు. టైటిల్ విన‌గానే.. ఇదేదో క్రైమ్ + థ్రిల్ల‌ర్ సినిమా అనేది అర్థ‌మైపోతోంది. ట్రైల‌ర్ చూస్తే… ‘అవును.. అది నిజ‌మే’ అనిపించేలా ఉంది. నారా రోహిత్‌, ఆది, సందీప్ కిష‌న్‌, సుధీర్‌బాబు న‌టించిన సినిమా ఇది. ఆ నాలుగు పాత్రలు, వాళ్ల ల‌క్ష్యం, సింపుల్‌గా క‌థ చెబుతూ.. ట్రైల‌ర్‌ని క‌ట్ చేశారు. ఉత్కంఠ రేపే స‌న్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయ‌న్న సంగ‌తి ట్రైల‌ర్ చూస్తే అర్థం అవుతోంది. రాజేంద్రుడు కూడా ఉన్నాడు కాబ‌ట్టి.. కామెడీకి కొద‌వ లేదు.

టేకింగ్‌, ట్రైల‌ర్‌ని క‌ట్ చేసిన విధానం… ఈ సినిమాపై హోప్స్ పెంచేలా చేస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని ఖ‌ర‌దీదైన రెస్టారెంట్‌.. అక్క‌డో పార్టీ… 5 కోట్ల ఖ‌రీదైన కారు.. ఇదీ టోట‌ల్‌గా శ‌మంత‌క‌మ‌ణి స్టోరీ. ‘శ‌మంత‌క‌మ‌ణి’ అంటే కారు అనే విష‌యం ముందే చెప్పేశారు. మొత్తానికి ట్రైల‌ర్ ఆసక్తిక‌రంగానే ఉంది. జులై రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ మ‌ల్టీస్టార‌ర్‌ థ్రిల్ల‌ర్ ఎలాంటి ఫ‌లితాన్ని సాధిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close