బ‌న్నీకి ఫుల్లుగా మార్కులేసిన ప‌టేల్ సార్‌

మీ అభిమాన న‌టీన‌టులు ఎవ‌రు? అని ఎవ‌రిని అడిగినా స‌మాధానం చెప్ప‌రు. సీనియ‌ర్ల‌ను అడిగితే అస్స‌లు చెప్ప‌రు. ఒక‌రి పేరు చెప్పి… ఇంకొక‌రి పేరు చెబితే బాగోదేమో అన్న భ‌యం వాళ్ల‌ది. మ‌ధ్యే మార్గంగా ‘అంద‌రూ బాగానే చేస్తున్నారండీ’ అంటారు. అదీకాక‌పోతే.. త‌మ‌కెక్కువ ఎవ‌రితో రాపో ఉందో వాళ్ల పేరు వాడేస్తారు. అయితే జ‌గ‌ప‌తిబాబు ఆ టైపు కాదు క‌దా. అందుకే నిర్మొహ‌మాటంగా స‌మాధానం చెప్పాడు. ‘న‌వ‌త‌రం క‌థానాయ‌కుల్లో మీకు ఎవ‌రంటే ఇష్టం’ అని అడిగితే.. సూటిగా `అల్లు అర్జున్‌` అనేశాడు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, ఆ మార్క్‌త‌న‌పై ప‌డ‌కుండా.. త‌న‌కంటూ ఓ సొంత ఇమేజ్ సృష్టించుకొన్నాడు బ‌న్నీ అంటూ కితాబు ఇచ్చారు.

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌ల‌సి న‌టిస్తున్నాడు. చ‌ర‌ణ్ మెప్పు కోస‌మైనా ఆ పేరు చెప్పి ఉండొచ్చు. ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, సాయిధ‌ర‌మ్ తేజ్‌.. వీళ్ల‌తో క‌ల‌సి న‌టించాడు. కావాలంటే వాళ్ల‌లో ఒక‌రి పేరు చెప్పొచ్చు. కానీ… ‘బ‌న్నీ’కి మార్కులు వేయ‌డం చూస్తుంటే.. నిజంగా జ‌గ‌ప‌తిది నిజాయ‌తీ ఉన్న ఛాయిస్ అనిపిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు కితాబుతో.. బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేస్కోవ‌చ్చిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close